Movie News

అన్నకు ‘గీత’ తమ్ముడికి ‘బేబి’

‘బేబి’ సినిమాకు రిలీజ్ ముంగిట వచ్చిన హైప్ చూసి ఇది సూపర్ హిట్ అవుతుందనే అందరూ అనుకున్నారు. రిలీజ్ రోజు ఊపు చూసి బ్లాక్ బస్టర్ అన్న అంచనాలు కలిగాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా అందరి అంచనాలను మించిపోయి కేవలం ‘బ్లాక్ బస్టర్’ అనే ట్యాగ్‌తో ఆగట్లేదు. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచేలా కనిపిస్తోంది.

ఈ సినిమా బడ్జెట్ పబ్లిసిటీతో కలిపినా రూ.8 కోట్లకు అటు ఇటుగా అయినట్లుగా చెబుతున్నారు. కానీ ఈ సినిమా తొలి వీకెండ్లోనే 20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ వరకు ఏ సినిమా అయినా జోరు చూపిస్తుంది. కానీ వీకెండ్ తర్వాత, వర్షాల మధ్య హౌస్ ఫుల్స్ పెట్టడం ‘బేబి’కే చెల్లింది. కేవలం ఎనిమిది రోజుల్లో ‘బేబి’ రూ.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందంటే ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో అంచనా వేయొచ్చు.

ఉప్పెన, జాతితరత్నాలు లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాల సరసన ‘బేబి’ నిలుస్తోంది. నిజానికి వాటికి అయినా అంతో ఇంతో స్టార్ ఎట్రాక్షన్ ఉంది. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కావడంతో మెగా అభిమానులు ‘ఉప్పెన’ను ఓన్ చేసుకున్నారు. ‘జాతిరత్నాలు’ విషయానికి వస్తే నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ కూడా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్సే. కానీ ‘బేబి’లో నటించిన వాళ్లెవ్వరికీ మార్కెట్ లేదు.

ఇమేజ్ లేదు. లీడ్ యాక్టర్స్ ముగ్గురూ కూడా దాదాపు కొత్త వాళ్లు అన్నట్లే. ఇలాంటి సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అనూహ్యం. విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ ఎలా అయితే చిన్న-మిడ్ రేంజ్ సినిమాల క్యాల్కులేషన్స్ అన్నీ మార్చేసిందో.. ఆనంద్ దేవరకొండ చేసిన ‘బేబి’ కూడా అలాంటి ట్రెండే క్రియేట్ చేస్తోంది. వచ్చే వారం ‘బ్రో’ లాంటి పెద్ద సినిమా లేకపోతే ఇది ఫుల్ రన్లో రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకునేదేమో.

This post was last modified on July 23, 2023 7:06 pm

Share

Recent Posts

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

2 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

3 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

6 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

9 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

9 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

11 hours ago