Movie News

హిడింబ.. అదే ప్లస్ అదే మైనస్

టాలీవుడ్లో కొన్ని వారాలుగా చిన్న సినిమాల హవా నడుస్తోంది. గత నెలలో ‘సామజవరగమన’ అంచనాలను మించిపోయి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘బేబి’ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది. రెండో వారంలోనూ ‘బేబి’ జోరు కొనసాగుతోంది. ఈ వారం రిలీజైన చిత్రాల్లో ‘హిడింబ’ ప్రామిసింగ్‌గా కనిపించింది. ఇది కూడా చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధిస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

దాని ట్రైలర్ అంత స్టన్నింగ్‌గా అనిపించింది. ‘హిడింబ’ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం కూడా చాన్నాళ్ల పాటు జనాలకు తెలియదు కానీ.. ట్రైలర్ చూడగానే ఈ సినిమా చూడాల్సిందే అన్న ఫీలింగ్ కలిగింది సినీ ప్రియులకు. ఆ ట్రైలరే సినిమాకు మంచి బిజనెస్ కూడా జరిగేలా చేసింది. సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌తో నిర్మాత అనిల్ సుంకర ‘సామజవరగమన’ తరహాలోనే దీనికి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ కూడా వేశాడు.

ఐతే ‘సామజవరగమన’కు వచ్చినట్లు ప్రిమియర్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాకేమీ రాలేదు. రిలీజ్ ముంగిట అంతా గప్‌చుప్ అన్నట్లు ఉండటంతోనే సినిమా మీద సందేహాలు నెలకొన్నాయి. ఇక శుక్రవారం రిలీజ్ రోజు థియేటర్లలో సినిమా చూసిన వాళ్లకు విచిత్రమైన అనుభూతి కలిగింది. ఈ సినిమా కాన్సెప్ట్ తెలుగు సినిమాలో నెవర్ బిఫోర్ అనడంలో సందేహం లేదు.

దర్శకుడు అనీల్ కన్నెగంటి ఎంతో పరిశోధించి, కసరత్తు చేసే ఈ సినిమా తీశాడని అర్థమైంది. మనుషుల్ని తినే కానిబల్స్ గురించి ఇందులో చూపించిన విషయాలు ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తాయి. కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఒళ్లు గగుర్పొడిచేలా ఆ సీన్లను డీల్ చేశాడు అనీల్. సినిమాలో ట్విస్ట్ కూడా బాగానే పేలింది. కాకపోతే ఈ సినిమాలో కొత్తగా అనిపించే కానిబల్ కాన్సెప్టే మైనస్ కూడా అయింది.

ఒక మనిషి ఇంకో మనిషిని తింటుంటే చూసి తట్టుకోవడం అందరు ప్రేక్షకుల వల్లా కాదు. తెర మీద వయొలెన్స్‌‌ను ఈజీగా తీసుకునేవాళ్లకు కూడా ఇది జీర్ణించుకోలేని విషయం.  అందుకే మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా చూసి తట్టుకోలేకపోయారు. వేరే వాళ్లకు రెకమండ్ చేయలేకపోయారు. సినిమాలో వేరే మైనస్‌లు ఉన్నా సరే.. ఇదే అది పెద్ద ప్రతికూలత అయింది.అందుకే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం అనుకున్నంతగా ప్రభావం చూపలేకపోయింది.

This post was last modified on July 23, 2023 2:41 pm

Share

Recent Posts

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

51 minutes ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

60 minutes ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

1 hour ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

4 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

4 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

4 hours ago