ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఒక వెలుగు వెలిగాడు. మణిశర్మ తర్వాత అతడికి దీటుగా నిలిచే సంగీత దర్శకుడే కనిపించలేదు. తమన్ నుంచి కొంత పోటీ ఉన్నా.. దేవిశ్రీ రేంజ్ వేరు అన్నట్లే ఉండేది. ఒక దశాబ్దానికి పాటు అతను తెలుగు సినిమా సంగీతాన్ని మామూలుగా ఏలలేదు. కానీ గత ఐదారేళ్లలో మాత్రం దేవి తనపై పెట్టుకున్న ఆశలు, అంచనాలను అందుకోలేకపోయాడనే చెప్పాలి.
ఈ టైంలో కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగానే ఉన్నాడు కానీ.. తన మ్యూజిక్‌లో మునుపటి ఫైర్ మాత్రం మిస్సయింది. చాలా సినిమాల్లో దేవి పాటలు అంచనాలను అందుకోలేకపోయాయి. నేపథ్య సంగీతం కూడా ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. అదే సమయంలో తమన్ రైజ్ అయ్యాడు. అరవింద సమేత, అల వైకుంఠపురములో, అఖండ లాంటి చిత్రాల్లో తన పాటలకు, నేపథ్య సంగీతానికి ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు తమిళంలో అనిరుధ్ లాంటి వాళ్ల దూకుడు మామూలుగా లేదు.
‘పుష్ప’ లాంటి ఒకటీ అరా చిత్రాల్లో మాత్రమే దేవిశ్రీ తన ముద్రను చూపించగలిగాడు. దేవి అభిమానులు అతడి పాత సినిమాల పాటలు, ఆర్ఆర్ బిట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నోస్టాల్జిగ్గా ఫీల్ అవుతూ అప్పటి దేవి ఏమైపోయాడు అని ఫీలయ్యే పరిస్థితి నెలకొంది. ఐతే చాన్నాళ్ల తర్వాత ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఓ సినిమా టీజర్‌తో బలమైన ముద్ర వేయగలిగాడు. అందరూ తన మ్యూజిక్ గురించి చర్చించుకునేలా చేయగలిగాడు.
ఆ చిత్రమే.. కంగువా. సూర్య హీరోగా శివ రూపొందిస్తున్న ‘కంగువా’ టీజర్ శనివారం అర్ధరాత్రి విడుదలైంది. అది చూసి తమిళ, తెలుగు ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోయారు. అందులో విజువల్స్ మామూలుగా లేవు. అదే సమయంలో బ్యాగ్రౌండ్ స్కోర్ మంటలు పుట్టించేసింది. టీజర్లో ఇంటెన్సిటీని ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లింది ఆర్ఆర్. ఆరంభం నుంచి చివరి వరకు ఒక లెవెల్లో సాగింది బ్యాగ్రౌండ్ స్కోర్. ఈ సినిమాతో పాత బాకీలన్నీ తీర్చేస్తూ.. తన మీద ఉన్న విమర్శలన్నింటికీ దేవి బదులు చెప్పబోతున్నట్లే కనిపిస్తోంది.
This post was last modified on July 23, 2023 2:39 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…