క్రైమ్ థ్రిల్లర్లకు మంచి సీజన్ నడుస్తున్న మాట వాస్తవమే కానీ అది సినిమాకు కాదు ఓటిటికి. ఒకవేళ థియేటర్ లో ఇలాంటి కంటెంట్ తో మెప్పించాలంటే సరైన హోమ్ వర్క్, మంచి క్యాస్టింగ్ పడాలి. లేదంటే కష్టం. మొన్న శుక్రవారం గంపగుత్తగా విడుదలైన రిలీజుల్లో హర్ చాఫ్టర్ 1 ఒకటి. చిలసౌ ఫేమ్ రుహాని శర్మ టైటిల్ రోల్ పోషించగా కేవలం గంట నలభై నిమిషాల నిడివితో దర్శకుడు శ్రీధర్ స్వరాఘవ్ హర్ ని రూపొందించారు. విశ్వక్ సేన్, అడవి శేష్ లతో హిట్ రెండు భాగాలు తీసిన హిట్టు కొట్టిన శైలేష్ కొలనుని స్ఫూర్తిగా తీసుకుని ఈ హర్ ని తీసిన సంగతి ట్రైలర్ లోనే అర్థమైపోతుంది.
ఒక జంట హత్యకు గురవుతుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న లేడీ పోలీస్ ఆఫీసర్ కు ట్రాజెడీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎవడి వల్ల అయితే తన విలువైన మనిషిని కోల్పోయిందో అతనే ఇప్పుడీ కేసులో ప్రధాన అనుమానితుడిగా మారడంతో ఎలాగైనా దీన్ని ఛేదించాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఇలాంటి వాటికి టెంపో చాలా కీలకం. పాత్రల మధ్య సస్పెన్స్ ని ముడిపెట్టే తీరు ప్రేక్షకుల ఊహకు అందకుండా సాగాలి. కానీ హర్ సెకండ్ హాఫ్ లో సన్నివేశాలు పదే పదే రిపీట్ అవుతూ సహనానికి పరీక్ష పెట్టేస్తాయి.
రుహాని శర్మతో పాటు ఇతర నటీనటులు పెర్ఫార్మన్స్ పరంగా పెద్దగా ఫిర్యాదు లేదు అసలు హంతుకుడి చుట్టూ అల్లుకున్న థ్రెడ్ సరిగా లేకపోవడం కనెక్ట్ అయ్యే అవకాశాన్ని తగ్గించేసింది. బడ్జెట్ అడ్డంకులను తట్టుకుని సాంకేతిక వర్గం బాగానే పని చేసినా థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే సినిమాని శ్రీధర్ ఇవ్వలేకపోయారు. హిట్ ఆడిందని అదే ఫార్మాట్ లో తీయాలని చూశాడు కానీ అది ఎందుకు సక్సెస్ అయ్యిందో సీరియస్ గా విశ్లేషించుకుంటే బాగుండేది. పైగా టైటిల్ కూడా ప్రాస కుదరాలని హిట్ సౌండ్ కి దగ్గరగా అనిపించే హర్ అని పెట్టారు. కానీ ఫలితం మాత్రం రివర్సే.
This post was last modified on July 23, 2023 1:53 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…