Movie News

విడుదలే కాలేదు…300 కోట్లకు పైగా లాభం

సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత పఠాన్ రూపంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న షారుఖ్ ఖాన్ సెప్టెంబర్ 7న జవాన్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ట్రైలర్ ఇటీవలే రిలీజై ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన దక్కించుకుంది. క్యాస్టింగ్ మొత్తం దాదాపు కోలీవుడ్ బ్యాచ్ నే దింపినా హిందీ ఫ్లేవర్ తో బాద్షా కెరీర్ లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నట్టు ముంబై టాక్. బడ్జెట్ రెండు వందల కోట్ల దాకా ఖర్చైనా సరే పెట్టుబడి పోను లాభం 364 కోట్లు వచ్చిందంటే షాకవ్వడం ఖాయం. అదెలాగో చూద్దాం.

ముందు థియేట్రికల్ డీల్స్ సంగతి చూస్తే హిందీ వెర్షన్ 155 కోట్లు, ఓవర్సీస్ 105 కోట్లు, తెలుగు కన్నడ చెరి 15 కోట్లు, తమిళం 17 కోట్లు, మళయాలం 7 కోట్లు మొత్తం కలిపి 314 కోట్లకు అమ్మారట. ఇక నాన్ థియేట్రికల్ సంగతి చూస్తే శాటిలైట్ 84, డిజిటల్ 130, మ్యూజిక్ 36 కలిపి 250 కోట్లవుతుంది. బడ్జెట్ పెట్టింది 200 కోట్లు. వచ్చింది 546 కోట్లు. అంటే రికవరీ పోను లాభం 364 కోట్లు అవుతుంది. సాధారణంగా బాలీవుడ్ మూవీకి ఇలాంటి ఫిగర్లు అరుదుగా నమోదవుతాయి. కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ స్థాయిలో జవాన్ కు క్రేజ్ ఉందని అక్కడి విశ్లేషకులు బల్లగుద్ది చెప్పడానికి బహుశా ఇదే కారణమేమో.

ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 600 కోట్లు వసూలు కావాలి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అది మంచి నీళ్లు తాగినంత సులభం. షారుఖ్ ని వివివిధ రకాల గెటప్స్ లో చూపిస్తున్న అట్లీ దీన్నో కంప్లీట్ యాక్షన్ కం రివెంజ్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ ఖైదీ వేట స్ఫూర్తిగా తీసుకుని కథ రాసుకున్నాడనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో తేలాలంటే రిలీజ్ దాకా వేచి చూడాలి. నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న జవాన్ కు అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది

This post was last modified on July 23, 2023 11:58 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

17 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago