బాలకృష్ణ భగవంత్ కేసరి విడుదల అక్టోబర్ 19కి లాక్ చేస్తూ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముందు అనుకున్న తేదీ కన్నా ఒక రోజు ముందుకు జరిగింది. అదే రోజు విజయ్ లియో ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. సితార సంస్థ 21 కోట్ల భారీ మొత్తానికి దీన్ని కొన్నట్టు వచ్చిన వార్త ఆల్రెడీ వైరల్ అయ్యింది. ఎంత ఇమేజ్ ఉన్నా విజయ్ స్టామినా టాలీవుడ్ వరకు పరిమితంగానే ఉంటూ వస్తోంది. ఒకప్పుడు బొటాబొటీగా ఉండేది కానీ తుపాకీ నుంచి క్రమంగా పెరుగుతూ పోయింది. రొటీన్ సినిమాలు సైతం బాగానే డబ్బులు తెచ్చేంత సేఫ్ జోన్ లోకి ఎప్పుడో వెళ్ళిపోయాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ బాలయ్యని ఫేస్ చేయడం విజయ్ కు అంత సులభంగా ఉండదు. ఎందుకంటే బిసి మాస్ సెంటర్స్ లో పట్టున్న నందమూరి సీనియర్ హీరోతో తలపడటం కమర్షియల్ కోణంలో రిస్కే. పైగా అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి దర్శకుడు. కళ్యాణ్ రామ్ నే పటాస్ లో ఊర మాస్ గా చూపించి మెప్పించిన ట్రాక్ రికార్డు తనది. సో ఈ కాంబో అంటే బయ్యర్లలో సహజంగానే విపరీతమైన క్రేజ్ నెలకొంది. పైగా శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్, తమన్ లాంటి ఆకర్షణీయమైన టీమ్ ఎలాగూ ఉంది. ట్రైలర్ వచ్చాక హైప్ రెట్టింపవుతుంది.
లియోకి సంబంధించి ప్రధానమైన సెల్లింగ్ ఫ్యాక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ విక్రమ్ ని హ్యాండిల్ చేసిన తీరు, దానికి తెలుగు రాష్ట్రాల్లో దక్కిన ఆదరణ బ్రాండ్ వేల్యూని పెంచింది. అంతమాత్రాన ఒకేసారి డబుల్ ట్రిపుల్ అయ్యిందని కాదు. అయినా సరే సితార అంత మొత్తానికి సిద్ధపడిందంటే ప్లాన్ పెద్దదే ఉంది. ఇదిలా ఉంటే రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా 20న దిగుతున్నాడు. తేదీలో ఎలాంటి మార్పు ఉండదని యూనిట్ అంటోంది. మరి బాలయ్య, మాస్ మహారాజాలను కాచుకోవడం అసలు ప్రమోషన్లకే రాని విజయ్ కి పెద్ద సవాళ్ళే తీసుకురావడం పక్కా.
This post was last modified on July 22, 2023 4:57 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…