ఓ పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖ సింగర్(గాయకుడు) సుధీర్ యదువంశీకి అత్యంత కఠిన మైన అనుభవం ఎదురైంది. తుపాకీ గురి పెట్టి మరీ ఓ వ్యక్తి తనను పాట పాడమని ఒత్తిడి చేసినట్టు సుధీర్ తాజాగా వెల్లడించాడు. సాధారణంగా ఉన్నత స్థాయి వర్గాల కుటుంబాల్లో ఏదైనా వేడుక జరిగితే.. దీనికి ముందు సంగీత్ ను నిర్వహించడం కామనే.
కుటుంబ సభ్యులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో వేడుకకు శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమానికి అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా హాజరవుతారు. ఇలానే ఒక వివాహ వేడుకకు ప్రముఖ గాయకుడు సుధీర్ యదువంశీ కూడా హాజరయ్యారు. ఈయన ప్రముఖ గాయకుడనే విషయం తెలిసిందే. అయితే.. ఈయన ఆ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత.. ఒక వ్యక్తి ఆయన పట్ల అత్యంత అనుచితంగా వ్యవహరించాడట.
“నేను రాసిన పాటను పాడు. అని ఆ వ్యక్తి అడిగాడు. అయితే.. నేను నిరాకరించాను. ఇక్కడకు కుదరదు అని చెప్పాను. కానీ, అతను నన్ను వేధించడం ప్రారంభించాడు. అయినా తట్టుకున్నాను. కానీ, కొంత సేపటికి వివాహ వేదికను దిగిపోతున్న నన్ను అతను అనుసరించాడు. నాకు దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా తుపాకీని బయటకు తీశాడు. నాకు గురి పెట్టాడు. పాట పాడతావా లేదా! అని ఒత్తిడి చేశాడు. నేను హడలి పోయాను” అని సుధీర్ తెలిపారు.
“అంతేకాదు.. తుపాకీ నావైపు గురి పెట్టి.. పాట పాడితేనే వివాహ వేదికను దిగి కిందకి లేకపోతే.. అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్కసారిగా భయపడిపోయాను. ఏమీ ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక, చేసేది ఏమీలేక.. అతనీ ఈగోను సంతృప్తి పరిచేందుకు.. ఆ పాటను పాడాను. ఒక్కసారికాదు.. ఏకంగా మూడు సార్లు” అని సుధీర్ వివరించారు.
This post was last modified on July 21, 2023 2:40 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…