అఖండ, వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్స్ తర్వాత హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్య అభిమానులకు భగవంత్ కేసరి మీద మాములు అంచనాలు లేవు. టీజర్ వచ్చాక రెట్టింపయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ లో కాస్త వయసు మళ్ళిన పాత్రలో బాలకృష్ణ విశ్వరూపం చూస్తారని ఆల్రెడీ టాక్ ఉంది. వరుసగా మూడో ఛాన్స్ కొట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హైప్ కు ఏ మాత్రం తగ్గకుండా స్కోర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే కథకు సంబంధించిన క్లూస్ మాత్రం ఇప్పటిదాకా బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడింది.
తాజాగా ఒక లీక్ ఆసక్తి రేపేలా ఉంది. భగవంత్ కేసరి స్టోరీ లైన్ 1992లో వచ్చిన బాలీవుడ్ మూవీ ఖుదా గవాకు కొంత దగ్గరగా ఉంటుందని వినికిడి. ఆ సినిమాలో నాగార్జున కూడా నటించారు. అందులో ప్రేయసికిచ్చిన మాట కోసం శత్రువుని చంపిన అమితాబ్ బచ్చన్ మరో ప్రాణ స్నేహితుడి కోసం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇతనెవరో తెలియకుండానే కూతురు ఇంకో చోట పెరిగి పెద్దవుతుంది. బయటికొచ్చాక ఆమెను కాపాడటమే పెద్ద సవాల్ గా మారుతుంది. ఈ పాత్రను శ్రీదేవి చేసింది. వచ్చిన న్యూస్ ప్రకారం ఈ రెండు పాత్రల్లో బాలయ్య, శ్రీలీల కనిపిస్తారట.
నిజమో కాదో తెలియదు కానీ బాలకృష్ణ జైలుకు వెళ్లే ఎపిసోడ్స్, బయటికి వచ్చాక అడుగడుగునా శత్రువులతో ఫైట్ చేసే సన్నివేశాలు దగ్గరి పోలికనైతే చూపిస్తున్నాయి. అప్పట్లో ఇది పెద్ద హిట్టు. పాటలు ఛార్ట్ బస్టర్ అయ్యాయి. తెలుగులో కొండవీటి సింహంగా డబ్బింగ్ చేశారు. అక్టోబర్ మూడో వారంలో దసరా పండక్కు విడుదల కాబోతున్న భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరరావు, లియోలతో పోటీ పడనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ భగవంత్ కేసరి ద్వారా అర్జున్ రామ్ పాల్ టాలీవుడ్ విలన్ గా పరిచయం కాబోతున్నాడు. బిజినెస్ సైతం బాలయ్య కెరీర్ హయ్యెస్ట్ కానుంది.
This post was last modified on July 21, 2023 10:01 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…