Movie News

ఫ్యాన్ మేడ్ ముందు ఒరిజినల్ జుజుబి

ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ హీరో ఎవరంటే ప్రభాస్ అనే చెప్పాలి. ‘బాహుబలి’ తర్వాత అతను చేసిన మూడు సినిమాలూ డిజాస్టర్లే అయినా సరే.. వాటి బడ్జెట్, బిజినెస్, ఇతర విషయాలు చూస్తే తన రేంజ్ ఏంటో అర్థం అవుతుంది. మూడు డిజాస్టర్ల తర్వాత కూడా నిర్మాతలు, ట్రేడ్ వర్గాలు ప్రభాస్ మీద నమ్మకం కోల్పోలేదు. ‘సలార్’కు 700-800 కోట్ల మధ్య బిజినెస్ జరిగే రేంజ్ కనిపిస్తోంది. ‘ప్రాజెక్ట్-కే’ మీద అంచనాలు ఇంకా ఎక్కువే ఉన్నాయి.

అది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కబోయే చిత్రం. బిజినెస్ కూడా అందుకు తగ్గట్లే రికార్డు స్థాయిలో జరిగేలాగే కనిపిస్తోంది. ఇంత బడ్జెట్, ఇంత అంచనాలతో ముడిపడ్డ సినిమా నుంచి నిన్న రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసి అభిమానులే కాక అందరూ షాకైపోయారు. టీంలో ఏ ఒక్కరికీ ఇది బాగా లేదు అనిపించలేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

‘ప్రాజెక్ట్-కే’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎంతమాత్రం రియల్‌గా అనిపించడం లేదు. దాన్ని ఎవరు డిజైన్ చేశారో కానీ.. ఏమాత్రం ప్రొఫెషనలిజం కనిపించడం లేదు. ప్రాజెక్ట్-కే మీద అభిమానులు తమకు ఉన్న అంచనాలతో తమ క్రియేటివిటీ చూపిస్తూ గత కొన్ని నెలల్లో ప్రభాస్ లుక్‌ను రకరకాలుగా డిజైన్ చేశారు. కొందరు అతణ్ని సైంటిస్ట్ అవతారంలో చూపిస్తే.. ఇంకొందరు హాలీవుడ్ సూపర్ హీరో క్యారెక్టర్లలోకి మార్చారు. ఐరెన్ మ్యాన్ అవతారంలో ప్రభాస్‌ను చూపిస్తూ చేసిన ఫ్యాన్ ఎడిట్స్ చూస్తే ఔరా అనిపించకమానదు.

ఇప్పుడు ‘ప్రాజెక్ట్-కే’ టీం వదిలిన లుక్‌ను… ఫ్యాన్ మేడ్ పోస్టర్లను పక్కన పెట్టి చూస్తే వాటి ముందు ఇది తేలిపోతోంది. నిన్న రాత్రి నుంచి అభిమానులు ఫీలవుతున్న విషయం ఇదే. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వందల సంఖ్యలో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ‘ఆదిపురుష్’కు సంబంధించి టీజర్ రిలీజైనపుడు ఎలాంటి నెగెటివిటీ కనిపించిందో.. ఇప్పుడు ‘ప్రాజెక్ట్-కే’ ఫస్ట్ లుక్ విషయంలోనూ అలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఇక ముందు రిలీజ్ చేసే ప్రోమోలతో మెప్పించకుంటే మాత్రం ‘ఆదిపురుష్’లా ఇదీ నెగెటివిటీని ఎదుర్కోక తప్పదు.

This post was last modified on July 20, 2023 6:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

1 hour ago

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…

1 hour ago

జపాన్ జనాలకు కల్కి ఎక్కలేదా

ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…

2 hours ago

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…

2 hours ago

ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!

నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……

2 hours ago

ట్రంప్ కేబినెట్ నిండా బిలియనీర్లే

అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…

4 hours ago