హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రుద్రమదేవి’ లాంటి భారీ చిత్రం తీసి మెప్పించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. దాని తర్వాత చేయాలనుకున్న ప్రాజెక్టు ‘హిరణ్య కశ్యప’నే.. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్లో తీయబోతున్నట్లు, అందుకోసం ప్రి ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నట్లు కూడా చాన్నాళ్ల పాటు చెబుతూ వచ్చాడు గుణ.
కానీ ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించడానికి ముందు బాగా ఆసక్తి చూపించిన సురేష్ బాబు తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు. గుణశేఖర్ శాకుంతలం మీదికి వెళ్లిపోయాడు. కట్ చేస్తే తర్వాత సురేష్ బాబు తర్వాత పెద్ద షాక్ ఇచ్చారు. హిరణ్య కశ్యప సినిమా తమ ప్రొడక్షన్లోనే తెరకెక్కుతుందని.. కానీ దర్శకుడు వేరు అని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత నెలలు గడిచినా ఈ ప్రాజెక్టుపై ఏ అప్‌డేట్ లేదు.
ఐతే ఇప్పుడు ఎట్టకేలకు హిరణ్యకశ్యపపై కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. రానానే ఇందులో హిరణ్యకశ్యపుడి పాత్ర పోషించబోతున్నాడు. స్వయంగా అతనే ఈ ప్రాజెక్టును ప్రకటించాడు. హాలీవుడ్ వేదికగా జరుగుతున్న కామిక్ కాన్ ఫెస్టివల్ కోసం యుఎస్ వెళ్లిన రానా.. అక్కడే హిరణ్యకశ్యప సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాలో తనే లీడ్ రోల్ చేయనున్నట్లు చెప్పాడు.
ఈ సినిమా అమర్ చిత్రకథల స్ఫూర్తితో తెరకెక్కనున్నట్లు వెల్లడించాడు. అన్నింటికీ మించి పెద్ద విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు స్క్రిప్టు అందిస్తున్నది స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అట. ఆ విషయం కూడా రానానే ప్రకటించాడు. మరి ఈ మెగా మూవీకి దర్శకుడు ఎవరు అన్నది ఆసక్తికరం. ఈ ప్రాజెక్ట్ స్కేల్ ప్రకారం చూస్తే ఎవరైనా పెద్ద దర్శకుడు తీస్తేనే దాని స్థాయి వేరుగా ఉంటుంది. మరి ఆ బాధ్యత ఎవరు చేపడతారో చూడాలి.
This post was last modified on July 19, 2023 11:25 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…