పెద్దగా పబ్లిసిటీ ఏమీ లేకుండానే.. కేవలం టీజర్, ట్రైలర్, పాటలతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి రిలీజ్ ముంగిట మంచి హైప్ తెచ్చకుంది బేబి సినిమా. ఆ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ నుంచి అనూహ్యమైన స్థాయిలో వసూళ్లు వచ్చాయి. వీకెండ్ అయితే ఆ సినిమా స్థాయికి, వచ్చిన కలెక్షన్లకు అసలు పొంతన లేదు. పెద్ద సినిమాలు సైతం వీకెండ్ తర్వాత డౌన్ అయిపోతుంటాయి కానీ.. బేబి మాత్రం వీక్ డేస్‌లోనూ కలెక్షన్లు కుమ్మేస్తోంది.
వర్షం కొంత ప్రతికూల ప్రభావం చూపుతోంది కానీ.. అయినా వసూళ్లు బాగానే ఉన్నాయి. సినిమాకు లాంగ్ రన్ తీసుకురావాలన్న ఉద్దేశంతో వీక్ డేస్‌లో ప్రమోహన్ల జోరు పెంచుతోంది టీం. ఇప్పటికే విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ చేశారు. దర్శకుడు సాయి రాజేష్ మీడియాను కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
ఇది కాక సినిమాకు ఇండస్ట్రీ ప్రముఖుల సపోర్ట్ కూడా దక్కుతోంది బేబి మూవీకి. చిత్ర బృందం కూడా వ్యూహాత్మకంగానే ఈ సపోర్ట్‌ను సినిమా ప్రమోషన్‌కు ఉపయోగించుకుంటోంది. బుధవారం అగ్ర దర్శకుడు సుకుమార్ బేబి మీద ప్రశంసల జల్లు కురిపిస్తూ ఫేస్ బుక్ పోస్టు పెట్టాడు. చాలా కాలం తర్వాత ఒక అసాధారణమైన రైటింగ్‌ను బేబి మూవీలో చూశానని.. ఈ సినిమా ఒక కొత్త ఒరవడిని, పంథాను తీసుకొస్తుందని… ప్రతి సన్నివేశం తనకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపించిందని.. ఒక సినిమాలో సిట్యుయేషన్‌ను కూడా పాత్రల తరహాలో ఈ సినిమాలోనే తొలిసారి చూశానని పేర్కొంటూ దర్శకుడు సాయి రాజేష్‌తో పాటు ముఖ్య పాత్రలు పోషించిన వైష్ణవి, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్‌లను కొనియాడాడు సుక్కు.
దర్శకుడు సాయిరాజేష్‌కు కూడా ఆయన కాల్ చేసి చాలాసేపు మాట్లాడాడట. అంతే కాక అల్లు అర్జున్ బుధవారమే ఈ సినిమా చూసి.. దర్శకుడు సాయి రాజేష్‌ను కలిసి అభినందించడమే కాక.. గురువారం అప్రిషియేషన్ మీట్ అంటూ ప్రత్యేకమైన కార్యక్రమానికి కూడా రాబోతున్నాడు. ఇదంతా బేబి ప్రమోషన్లకు బాగా కలిసొస్తుందని వేరే చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on July 19, 2023 11:11 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…