‘కస్టడీ’ తో నిరాశ పరిచిన నాగ చైతన్య నెక్స్ట్ చందూ మొండేటి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘తండేల్(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే కథ పూర్తయింది. కార్తీక్ అనే రైటర్ అందించిన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.
ప్రస్తుతం చందూ మొండేటి మిగతా కాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. చైతు సరసన కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు. దసరాలో వెన్నెల పాత్రను పోలి ఉండటంతో ఈ సినిమాకు ఆమె పర్ఫెక్ట్ అని, అలాగే చైతుకి కూడా కొత్త కాంబినేషన్ గా ఉంటుందని భావిస్తున్నారట. డేట్స్ అడ్జస్ట్ అయితే కీర్తిను ఫిక్స్ చేసుకోవడం ఖాయం.
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ ను తీసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అనిరుద్ ఫిక్స్ అయితే బడ్జెట్ మరో పది కోట్లు పెరగనుంది. అనిరుద్ కాకుంటే రెహ్మాన్ లాంటి అగ్ర సంగీత దర్శకుల వైపు చూస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ తో ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇన్సైడ్ టాక్. శ్రీకాకుళం నుండి గుజరాత్ వలస వెళ్ళిన మత్స్య కారుడిగా చైతు కనిపించనున్నాడు.
ప్రస్తుతం చై తన లుక్ పై శ్రద్ద తీసుకుంటూ వర్క్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ చైతు ని చూడని విధంగా ప్రెజెంట్ చేసేందుకు చందూ మొండేటి ప్రయత్నిస్తున్నాడు. కార్తికేయ 2 తర్వాత చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమా చైతు కి బిగ్గెస్ట్ హిట్ ఇస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
This post was last modified on July 19, 2023 11:01 pm
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…