హైపర్ ఆది.. తెలుగు టీవీ రంగంలో ఒక సంచలనం. ఒక కామెడీ షోలో స్కిట్లు చేసుకునే కుర్రాడు సినిమా హీరోల స్థాయిలో పాపులారిటీ సంపాదించడం అన్నది ఊహకందని విషయం. దాన్ని నిజం చేసి చూపించాడు ఆది.
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో ఆది హంగామా ఎలా ఉంటుందో.. అతడి ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముందు అదిరే అభి టీంలో ఒకడిగా ఉన్న ఆది.. ఆ తర్వాత సొంతంగా టీం పెట్టుకుని దాన్ని తనదైన శైలిలో నడిపిస్తూ తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు.
ఇప్పుడు ‘జబర్దస్త్’కు ప్రధాన ఆకర్షణ అతనే అంటే అతిశయోక్తి లేదు. ఆది స్కిట్లకు యూట్యూబ్‌లో మిలియన్లకు మిలియన్లు వ్యూస్ వస్తుంటాయి. వేరే టీంల స్కిట్లకు అందులో పదో వంతు కూడా వ్యూస్ ఉండవు. ఆది సంక్రాంతికి చేసిన ఓ స్కిట్ ఏకంగా ఆరు కోట్ల వ్యూస్ తెచ్చుకోవడం విశేషం.
ఇక ఆది వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే అతడికింకా 30 ఏళ్లు కూడా నిండలేదు. జబర్దస్త్ ఆర్టిస్టుల్లో సుడిగాలి సుధీర్ తర్వాత ఎక్కువగా పెళ్లి గురించి చర్చ జరిగే ఆది విషయంలోనే. అతడి పెళ్లి గురించి అప్పుడప్పుడూ పుకార్లు వస్తుంటాయి. కొందరు యాంకర్లతో అతడికి ముడి పెడుతుంటారు. వర్షిణితో అతను ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని ఇంతకుముందు ఓ ప్రచారం జరిగింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆదిని ఇదే విషయమై ప్రశ్నిస్తే.. తాను సినీ, టీవీ రంగాల నుంచి ఎవరినీ పెళ్లి చేసుకోవట్లేదని స్పష్టం చేశాడు. తాను తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే చేసుకుంటానని.. తన పెళ్లి ఆల్రెడీ ఫిక్స్ కూడా అయిందని చెప్పాడు. ఆదిది నెల్లూరు జిల్లా కాగా.. పొరుగు జిల్లా అయిన ప్రకాశం నుంచి ఓ అమ్మాయిని తల్లిదండ్రులు ఆది కోసం చూశారట. ఆ అమ్మాయితో వచ్చే ఏడాది తన పెళ్లి ఉండొచ్చని ఆది తెలిపాడు.
This post was last modified on April 24, 2020 5:16 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…