టాలీవుడ్లో ఇప్పుడు చిన్న సినిమాల హవా నడుస్తోంది. మూడు వారాల కిందట ‘సామజవరగమన’ అనే చిన్న చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్నందుకుంది. ఆ సినిమా థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతోంది. రెండు వారాల పాటు ఆ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.50 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉన్న ఆ సినిమా.. యుఎస్‌లో ఏకంగా మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసింది.
ఇక గత వారాంతంలో వచ్చిన ‘బేబి’ అయితే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపుతోందనే చెప్పాలి. వీకెండ్లో ఎవ్వరూ ఊహించని కలెక్షన్ నంబర్స్‌ను అందుకున్న ఆ చిత్రం.. వీక్ డేస్‌లో కూడా ఏమాత్రం వీక్ అవ్వకుండా సాగిపోతోంది. రెండు వారాల వ్యవధిలో ఇలా రెండు చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ను కళకళాడించడం అరుదైన విషయం. బాక్సాఫీస్‌కు ఇంకా ఉత్సాహాన్నిస్తున్న విషయం ఏంటంటే.. ఈ వారం రాబోతున్న మరో చిన్న సినిమాకు మంచి బజ్ కనిపిస్తోంది.
టీవీ యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్ తమ్ముడైన అశ్విన్ బాబు హీరోగా నటించిన ‘హిడింబ’కు ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో మంచి బజ్ కనిపిస్తోంది. ఈ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం కూడా నెల ముందు వరకు చాలామందికి తెలియదు. నేరుగా ట్రైలర్‌తో ఆ సినిమా ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. మైండ్ బ్లోయింగ్ అనిపించే విజువల్స్, క్వాలిటీ, క్యూరియాసిటీ పెంచే కథాంశం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ట్రైలర్ చూడగానే సినిమా చూడాలి అనే ఫీలింగ్ కలిగింది అందరికీ. కేవలం ఈ ఒక్క ట్రైలర్‌తోనే సినిమాకు హైప్ వచ్చింది.
ఇంతకుముందు అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య, రన్ లాంటి సినిమాలు రూపొందించిన అనీల్ కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకుడు. ‘సామజవరగమన’తో పెద్ద హిట్ కొట్టిన అనిల్ సుంకరనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేశాడు. ఆయన ఎంతో నమ్మకంగా ఈ సినిమాకు కూడా ముందే ప్రిమియర్స్ వేస్తున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు రావడం, బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్టవబోతున్న మరో చిన్న సినిమాగా నిలవడం ఖాయం. అదే జరిగితే నాలుగు వారాల వ్యవధిలో మూడు చిన్న సినిమాలు సూపర్ సక్సెస్ అయిన అరుదైన సందర్భం చూడబోతున్నట్లే.
This post was last modified on July 18, 2023 10:45 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…