థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి హాట్ స్టార్‌లో నేరుగా రిలీజ్ చేసిన సినిమాకు ఇంకా థియేట్రికల్ రిలీజ్ ఏంటి అని.. ఈ హెడ్డింగ్ చూసి ఆశ్చర్యం కలుగుతోందా? ఇది నిజం.
ఇండియాలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటే అప్పుడు ఈ చిత్రాన్ని వాటిలో ప్రదర్శిస్తే ప్రదర్శించొచ్చు కానీ.. ఈలోపే సుశాంత్ చివరి సినిమాను వెండితెరపై చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఆ అవకాశం న్యూజిలాండ్‌లోని భారతీయ సినీ ప్రేక్షకులకు దక్కుతోంది.
కరోనా దేశంలోకి అడుగు పెట్టి కూడా.. దాని ప్రభావం నుంచి చాలా త్వరగా, తక్కువ నష్టంతో బయటపడ్డ దేశాల్లో న్యూజిలాండ్ పేరే ముందు చెప్పుకోవాలి. కట్టుదిట్టమైన చర్యలతో, ప్రజల క్రమశిక్షణతో అక్కడి నుంచి కరోనాను పారదోలారు.
న్యూజిలాండ్ కరోనా ఫ్రీ కంట్రీగా మారి మూడు నెలలు దాటింది. అక్కడ ఆల్రెడీ థియేటర్లు సహా అన్నీ తెరిచారు. బాలీవుడ్ పాత, కొత్త సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ను వెండితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
దీని తర్వాత ఆస్ట్రేలియాలో సైతం ‘దిల్ బేచారా’ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా ప్రభావం తక్కువగా ఉండి, థియేటర్లు నడుస్తున్న వివిధ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి.
ఇండియాలో ఈ ఏడాది ఆఖరుకు థియేటర్లు తెరుచుకుంటాయని భావిస్తున్నారు. అప్పుడు ఈ చిత్రాన్ని సెలక్టివ్‌గా థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశముంది. గత 24న హాట్ స్టార్‌లో రిలీజైన ‘దిల్ బేచారా’ అద్భుతమైన స్పందన రాబట్టుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 15, 2020 10:36 am
ఏపీలో తాజాగా జపాన్‌లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ…
రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా…
సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ .. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.…
మెగాభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ విడుదలకు ఇంకో 15 రోజులు మాత్రమే టైముంది. ప్రమోషన్లు రెగ్యులర్…
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…