ఇంకో పన్నెండు రోజుల్లో విడుదల కాబోతున్న బ్రో ప్రమోషన్ల పట్ల అభిమానుల అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. వారాహి యాత్ర సక్సెస్ కావడంతో అందరూ పవన్ స్పీచ్ లను ఆస్వాదించే మూడ్ లో ఉన్నారు. దీని వల్ల బ్రో మీద ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు. ముఖ్యంగా వదిలిన రెండు పాటలు కనీస అంచనాలు అందుకోలేకపోవడం మరో దెబ్బ కొట్టింది. దర్శకుడు సముతిరఖని చివరి దశలో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో బయటికి రావడం లేదు. నిర్మాత నాగవంశీ దీంతో పాటు గుంటూరు కారం చూసుకుంటూ తీరిక దొరికే పరిస్థితిలో లేరు.
ఇదంతా ఎలా ఉన్నా కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధమయ్యింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో 25 సాయంత్రం గ్రాండ్ గా ఈ వేడుక నిర్వహించబోతున్నారు. ఛీఫ్ గెస్టుగా ఎవరు వస్తారనే విషయం మీద పెద్దగా సస్పెన్స్ అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలో నటించిన తారాగణం తప్ప ఇంకెవరూ ముఖ్య అతిథులు ఉండరని ఇప్పటిదాకా ఉన్న అప్ డేట్. ఎవరు వచ్చినా మూవీతో పాటు జనసేన గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టడం కన్నా కేవలం క్యాస్టింగ్ కే పరిమితం చేయాలని పవన్ కోరినట్టు ఇన్ సైడ్ టాక్.
బిజినెస్ మాత్రం క్రేజీగానే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంకో రెండు మూడు రోజుల్లో రేట్లు అగ్రిమెంట్లు పూర్తవుతాయి. బయ్యర్లు ఆఫర్ చేస్తున్న మొత్తం చూస్తుంటే టికెట్ రేట్లు పెంచుకుంటేనే వర్కౌట్ అయ్యేలా ఉంది. మరి ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పవన్ ఏం చెబుతారో చూడాలి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు హైక్ లేకపోయినా తొంబై కోట్ల దాకా రాబట్టాయి. బ్రో సైతం ఇదే దారి పట్టక తప్పేలా లేదు. సాయి ధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా ప్రియా వారియర్ చెల్లి పాత్రలో కనిపించనుంది. త్రివిక్రమ్ రచన మీదే అందరి చూపంతా