చిన్న సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం చాలా కష్టమైపోతున్న ఈ రోజుల్లో.. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో వసూళ్లు రాబడుతూ ఉంటాయి. టాలీవుడ్ బాక్సాఫీస్‌లో రెండు వారాల వ్యవధిలో అలాంటి అద్భుతాలు రెండు జరిగాయి. జూన్ 29న విడుదలైన శ్రీ విష్ణు సినిమా ‘సామజవరగమన’ రెండు వారాల పాటు అదిరిపోయే వసూళ్లు రాబడుతూ బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లగా.. ఇప్పుడు ‘బేబి’ అనే మరో చిన్న సినిమా సంచలనం రేపుతోంది.
రిలీజ్ ముందు రోజు వేసిన పెయిడ్ ప్రిమియర్స్‌తోనే ఈ సినిమా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ షోలన్నింటికీ అడ్వాన్స్ ఫుల్స్ పడిపోయాయి. ఇక రిలీజ్ రోజు డివైడ్ టాక్‌ను తట్టుకుని ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. శనివారం ఫస్ట్ షోలు, సెకండ్ షోలన్నీ ప్యాక్డ్ హౌస్‌లతో నడిచాయి. ఇక ఆదివారం అయితే ‘బేబి’ జోరు మామూలుగా లేదు.
హైదరాబాద్‌లోని అనేక మల్టీప్లెక్సుల్లో ‘బేబి’ షోలు కొన్ని గంటల ముందే సోల్డ్ ఔట్ అయిపోయాయి. మిగతా షోలన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ ఉన్నాయి. గ్రీన్ కలర్లో కనిపిస్తున్న షోలు చాలా తక్కువ. సాయంత్రం, రాత్రి షోలన్నింటికీ హౌస్ ఫుల్స్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో అన్ని మేజర్ సిటీల్లోనూ ‘బేబి’ మాస్ రాంపేజ్ చూపిస్తోంది.
మ్యాట్నీలకు కూడా ఫుల్స్ పడిపోయాయి. సినిమాకు రివ్యూలు అంత అనుకూలంగా లేకపోయినా.. మిక్స్డ్ టాక్ వచ్చినా.. యూత్‌కు మాత్రం సినిమా బాగా కనెక్ట్ అయింది. వాళ్లు ఎగబడి చూస్తున్నారు. రెండు రోజుల్లోనే రూ.14 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.30 కోట్ల గ్రాస్ రేంజికి వెళ్లేలా కనిపిస్తోంది. వీకెండ్ తర్వాత కూడా సినిమా బలంగా నిలబడే సంకేతాలే కనిపిస్తున్నాయి. మరి సోమవారం వసూళ్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం.
This post was last modified on July 16, 2023 3:52 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…