Movie News

అమ్మాయిని బ్యాడ్‌గా చూపిస్తే వసూళ్ల మోతే..

తెలుగు తెరపైన లేడీ క్యారెక్టర్లు చాలా వరకు సాఫ్ట్‌గానే కనిపిస్తాయి. మన దగ్గర లేడీ విలన్లే చాలా తక్కువగా కనిపిస్తారసలు. ఇక మిగతా లేడీ క్యారెక్టర్లలో చాలా వరకు నామమాత్రంగా ఉండేవే. హీరోయిన్ల పాత్రల గురించి చెప్పాల్సిన పని లేదు. పది సినిమాల్లో ఒకటో రెండో మినహాయిస్తే.. మిగతావన్నింట్లోనూ హీరోయిన్ ఉందంటే ఉంది అన్నట్లుగా ఉంటుంది.

ఒకవేళ ఆ పాత్రలో బలం ఉన్నా.. అది పాజిటివ్ క్యారెక్టరే అయ్యుంటుంది. హీరోయిన్ పాత్రను నెగెటివ్ షేడ్స్‌తో చూపించడం చాలా అరుదు. అలా చూపించినా ప్రేక్షకులు హర్షించరు అనే భావన ఉంటుంది. ఐతే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. హీరోయిన్లలోని నెగెటివ్ షేడ్స్‌ను ఎలివేట్ చేస్తూ.. దాన్ని సక్సెస్ మంత్రంగా మార్చేస్తున్నారు దర్శకులు. ఈ ట్రెండు మొదలైంది ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతోనే అని చెప్పాలి. ఆ చిత్రంలో హీరోయిన్ పాత్ర ప్రేక్షకులకు మామూలు షాక్ కాదు.

అప్పటికే ఓ అబ్బాయిని ప్రేమించి, పెళ్లికి కూడా సిద్ధమైన అమ్మాయి.. మధ్యలో శారీరక సుఖం కోసం ఇంకొక అబ్బాయిని లైన్లో పెట్టి, అతణ్ని వాడుకుని వదిలేయడం.. మళ్లీ వేరే అబ్బాయిని పెళ్లాడటం.. ఇలాంటి కాన్సెప్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఈ ట్విస్టే సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచింది. కుర్రాళ్లు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయి దాన్ని బ్లాక్ బస్టర్ చేసి పెట్టారు. ఇక వేసవిలో రిలీజైన ‘విరూపాక్ష’ సినిమా ఇంకో రకం. అదేమీ లవ్ స్టోరీ కాదు. కానీ అందులో హీరోయినే మెయిన్ విలన్ అనే విషయం చివరి వరకు తెలియదు. అది తెలిసినపుడు ప్రేక్షకులు షాక్ అవుతారు.

ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఇరగాడేసింది. ఇప్పుడు రిలీజైన ‘బేబి’లో హీరోయిన్ పాత్రను చూసి ఈ సినిమాను ‘ఆర్ఎక్స్ 200’గా అబివర్ణిస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో కూడా హీరోయిన్ ఒకేసారి ఇద్దరబ్బాయిలతో వ్యవహారం నడుపుతుంది. మనస్ఫూర్తిగా తనను ప్రేమించే అబ్బాయితో కనెక్ట్ అయి ఉంటూనే ఇంకొక అబ్బాయికి సర్వం అర్పించేస్తుంది. ఈ పాత్ర.. సినిమాలోని సన్నివేశాలతో చాలామంది యూత్ బాగా రిలేట్ అవుతున్నారు. ఈ సినిమాను యూత్ ఎగబడి చూస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.

This post was last modified on July 15, 2023 5:12 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

8 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

9 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

9 hours ago