Movie News

గౌతం, సితార ఎంట్రీ పై నమ్రతా క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టి సితార చాలా టాలెంటెడ్ అమ్మాయి. ఈ విషయం ఆమె డాన్సింగ్ వీడియోస్ చూసిన అందరికీ తెలుసు. అందుకే మహేష్ ఫ్యాన్స్ కూడా సితార టాలెంట్ కి మురిసిపోతుంటారు. సితార కి సినిమా లంటే చాలా ఇష్టమని తన డాన్స్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. మహేష్ సర్కారు వారి పాట సినిమా ప్రమోషనల్ సాంగ్ లో సితార డాన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో కూడా ఆ సాంగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. 

దీంతో మహేష్ , నమ్రత ఎక్కడా ప్రెస్ మీట్ లో కనిపించినా వారిద్దరికీ సితార సినిమా ఎంట్రీ గురించి ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంది. కానీ వారు కూడా తన ఇష్టమే మా ఇష్టం పదే పదే చెప్పారు. కానీ ఇప్పుడు సితార కి కూడా ఆ ప్రశ్న ఎదురైంది. ఫర్ ది ఫస్ట్ టైమ్ సితార ఓ జ్యువలరీ యాడ్ చేసింది. అందులో భాగంగా ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్ లో తల్లి నమ్రతా తో కలిసి మీడియా ముందుకు వచ్చింది మహేష్ కూతురు. 

మీకు సినిమా అంటే ఇంటరెస్ట్ ఉందా ? అని మీ పేరెంట్స్ ని చాలా మంది అడిగారు. ఇప్పుడు మీ రియాక్షన్ చెప్పండి అని మీడియా నుండి సితార కి క్వశ్చన్ వచ్చింది. దీంతో ఒక్కసారి ఎస్ అంటూ సంతోషంగా రెండు చేతులను ఊపుతూ రియాక్ట్ అయ్యింది సితార. నమ్రతా కూడా వాళ్ళ ఇష్టమే మా ఇద్దరి ఇష్టం కూడా అంటూ సితారను హీరోయిన్ చేయడం ఇష్టమే అంటూ తెలిపింది.

అయితే తను ఎప్పుడు ఎంట్రీ ఇస్తుంది ? ఎలాంటి సినిమా చేస్తుంది ? అనేది ఇప్పుడే చెప్పలేం అన్నట్టుగా నమ్రతా అన్నారు. అలాగే మహేష్ వారసుడు గౌతం ఎంట్రీ పై కూడా నమ్రతా రియాక్ట్ అయ్యారు. తనకి కూడా సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉందని , ఇప్పుడు తనకి 16 ఏళ్ళే అని ఇంకో 7 ఏళ్ల తర్వాత తన ఎంట్రీ ఉంటుందని చెప్పుకుంది.

This post was last modified on July 15, 2023 4:52 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago