Movie News

పూరి జగన్నాథ్ తర్వాత లోకేషే

కొత్త తరం ఫిలిం మేకర్స్ ఎంత క్రియేటివ్ గా ఉన్నా సరే వీలైనంత వేగంగా సినిమాలు తీయడం అవసరం. అప్పుడే నిర్మాత పెట్టుబడికి, థియేటర్ల ఫీడింగ్ కి తగినంత భద్రత ఉంటుంది. ఒకప్పుడు దాసరి, రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాలు ఒకేరోజు రెండు మూడు షూటింగులు పెట్టుకున్న ఉదంతాల నుంచి ఏడాదికి ఒకటి పూర్తి చేస్తేనే గొప్పనే స్టేజికి దిగిపోయాం. కారణాలు ఏమైనా స్టార్ డైరెక్టర్లలో ఈ వేగం లోపించడం వల్లే హీరోలు కూడా ఇబ్బంది పడుతూ సంవత్సరానికి ఒకటి రిలీజ్ చేయించడానికే నానా తంటాలు పడుతున్నారు. కానీ లోకేష్ కనగరాజ్ మాత్రం స్పెషల్ గా నిలుస్తున్నాడు.

ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇప్పటిదాకా తీసింది అయిదు సినిమాలు. మొదటిది తప్ప మిగిలినవి అన్నీ పెద్ద మార్కెట్ ఉన్న స్టార్లేవే. అయినా సరే దేనికీ నూటా యాభై పని దినాలు తీసుకోకపోవడం అతని స్పీడ్ కి నిదర్శనం. మానగరం 45 రోజులు, ఖైదీ 62 రాత్రిళ్ళు, మాస్టర్ 129 రోజులు , విక్రమ్ 110 రోజులు, తాజాగా లియోకి 125 రోజులకు గుమ్మడికాయ కొట్టించాడు. కార్తీ, విజయ్, కమల్ హాసన్ లాంటి మోస్ట్ వాంటెడ్ స్టార్లతోనే లోకేష్ ఈ ఫీట్ సాధించాడు. బడ్జెట్ ఎంత పెరిగినా సరే వర్కింగ్ డేస్ ని మాత్రం తన అదుపులో ఉంచుకుంటున్న లోకేష్ కనగరాజ్ నుంచి నిజంగానే స్ఫూర్తి తీసుకోవాల్సిందే.

ఒకప్పుడు ఈ స్టైల్ పూరి జగన్నాధ్ దగ్గర ఉండేది. మహేష్ బాబుతో బిజినెస్ మెన్ ని మూడు నెలల్లో తీయడం రికార్డుగా చెప్పుకుంటారు. పోకిరి, ఇడియట్ లకు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. లియో తర్వాత ఈ స్పీడ్ లో ఎలాంటి మార్పు ఉండదని లోకేష్ అంటున్నాడట. అతని లిస్టులో ప్రస్తుతం విక్రమ్ 2, ఖైదీ 2, రోలెక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా రామ్ చరణ్, ప్రభాస్ లతో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదే దూకుడు కొనసాగిస్తే ఇవన్నీ ఇంకో అయిదేళ్లలో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. చేతిలో కథలు రెడీగా ఉంటే ఇలాంటి కాన్ఫిడెన్సే వస్తుంది 

This post was last modified on July 15, 2023 11:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాకిస్థాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ.. భారత్‌ రాకుంటే జరిగేది ఇదే

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలు క్రికెట్ పరంగా మరింత హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. రెండు…

42 mins ago

ఆదాయం కోసం మల్టీప్లెక్సుల తిప్పలు

థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చడంలో మల్టీప్లెక్సుల పాత్ర చాలా పెద్దది. పట్టుమని పాతిక రూపాయలు…

2 hours ago

బన్నీ ఫొటో ఆ బుక్.. సోషల్ మీడియా చర్చ

అల్లు అర్జున్‌ను తాజాగా ఓ నార్త్ ఇండియన్ అభిమాని కలవడం చర్చనీయాంశం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ నుంచి సైకిల్ మీద…

2 hours ago

బోయపాటి.. ఈసారైనా బడ్జెట్ సరిపోద్దా..

ప్రస్తుత ట్రెండ్ లో మాస్ కమర్షియల్ దర్శకులుగా నిలదొక్కుకోవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఒకప్పుడు ఈ ఫార్మాట్…

3 hours ago

సామ్‌లో మ‌ళ్లీ ఆ ఛార్మ్

దక్షిణాదిని తిరుగులని స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె విజయశాంతి, నయనతార, అనుష్కల మాదిరి…

3 hours ago

అమ్మ‌కానికి క‌ర‌ణ్ జోహార్ సంస్థ‌?

‘కుచ్ కుచ్ హోతా హై’ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్‌తో దర్శకుడిగా పరిచయం అయిన కరణ్ జోహార్.. బాలీవుడ్ చరిత్రలోనే…

4 hours ago