బేబికి వచ్చిన మిశ్రమ స్పందన కాసేపు పక్కనపెడితే థియేటర్ కలెక్షన్లు బాగున్న మాట వాస్తవం. ఇవాళ వచ్చిన కొత్త రిలీజుల్లో రెండు డబ్బింగులు కావడంతో వాటిని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. మిగిలింది బేబీ ఒక్కటే. నిడివి, సెకండ్ హాఫ్ తదితర అంశాల మీద కంప్లయింట్స్ ఉన్నప్పటికి బోల్డ్ కంటెంట్ కోసం యూత్ వెళ్లిపోతున్నారు. మెయిన్ సెంటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. ఫైనల్ రిజల్ట్ కి ఇంకా టైం ఉంది కానీ వైష్ణవి చైతన్య ప్రతిభ జనాలకు బాగా తెలిసొచ్చింది. ఇద్దరి కుర్రాళ్ల ప్రేమలో పడే డ్యూయల్ షేడ్స్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది
సోషల్ మీడియాలో ప్రస్థానం మొదలుపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో చిన్న వేషాల నుంచి ఇప్పుడు మెయిన్ హీరోయిన్ కావడం దాకా తన ప్రయాణం పెద్దదే. ఇప్పుడీ బేబీలో ఊహించిన దానికన్నా ఎక్కువ పేరు రావడంతో అవకాశాలు క్యూ కడతాయనే అంచనా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అయితే ఇక్కడో ఆలోచించాల్సిన పాయింట్ ఉంది . ఆరెక్స్ 100లో పాయల్ రాజ్ పుత్ కు ఫేమ్ వచ్చినప్పుడు నిర్మాతలు అలాంటి పాత్రలే ఆఫర్ చేయడంతో తన కెరీర్ ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. ఇప్పుడా క్యారెక్టర్ చాయలు కొన్ని కనిపించే పాత్రనే బేబీలో చేసింది. సో దర్శకులు ఆ తరహా కథలే చెప్పొచ్చు
ఏది ఏమైనా వైష్ణవి చైతన్య చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బేబీ తాలూకు స్టాంప్ కొంతకాలం వెంటాడుతూనే ఉంటుంది. రచయితలు కూడా అది దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ లు రాస్తారు. గ్లామర్ ఉన్నప్పటికీ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రావడానికి కొంత టైం పట్టొచ్చు.ఒకటి రెండు బ్లాక్ బస్టర్స్ పడితే తప్ప చూడరు. ఎంతసేపూ కేరళ, ముంబై నుంచి దిగుమతి చేసుకోవడం తప్ప తెలుగు అమ్మాయిలను పట్టించుకోవడం లేదన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యంలో వైష్ణవి చైతన్యకు ఏ మేరకు ప్రోత్సాహం వస్తుందో చూడాలి.
This post was last modified on July 15, 2023 12:55 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…