అనుకున్నట్లే ‘బేబి’ అనే చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపేలా కనిపిస్తోంది. అదిరిపోయే పాటలు.. చక్కటి ప్రోమోలతో యువ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. రిలీజ్ ముందు రోజు, గురువారం పెయిడ్ ప్రిమియర్స్ నుంచి అదిరిపోయే స్పందన తెచ్చుకుంది. హైదరాబాద్ సిటీలో దాదాపు 20 షోలు వేస్తే.. అన్నిటికీ ఫుల్స్ పడిపోవడం విశేషం. ప్రసాద్ మల్టీప్లెక్స్ ఒక్కదాంట్లోనే ఏడెనిమిది షోలు పడ్డాయి. అన్నింటికీ హాళ్లు నిండిపోయాయి.
గురువారం రాత్రి ఐమాక్స్‌లో సందడి చూస్తే.. ఎవరైనా పెద్ద హీరో సినిమా రిలీజైందా అన్న సందేహాలు కలిగాయి. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి రెండున్నర వరకు ‘బేబి’ సందడి కొనసాగింది. ప్రిమియర్స్ నుంచి సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. ఐతే ఉదయం మార్నింగ్ షోలకు టాక్ మిక్స్‌డ్‌గా వచ్చింది. సమీక్షలు కూడా కొంచెం అటు ఇటుగానే వచ్చాయి.
ఐతే టాక్ తొలి రోజు సినిమా వసూళ్ల మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపేలా కనిపించడం లేదు. ఈ ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘బేబి’ థియేటర్లు జనాలతో కళకళలాడాయి. యూత్ పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చారు. సింగిల్ స్క్రీన్లలో సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి. ఇంతకుముందు ‘ఆర్ఎక్స్ 100’ సినిమా కోసం ఎలాగైతే ఎగబడ్డారో అలాగే ఈ చిన్న సినిమా కోసం కూడా యువ ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తున్నారు.
ఆ సినిమా లాగే డివైడ్ టాక్ సినిమా మీద పెద్దగా ప్రభావం చూపేలా కనిపించడం లేదు. యుఎస్‌లో ప్రిమియర్స్ నుంచి ఈ సినిమా లక్ష డాలర్లకు పైగా కలెక్ట్ చేయడం సెన్సేషన్ అనే చెప్పాలి. వీకెండ్ అంతా కూడా ‘బేబి’ వసూళ్ల మోత మోగించేలా కనిపిస్తోంది. ఆ లోపే బయ్యర్లందరూ కూడా బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా ఫుల్ రన్లో రూ.15 కోట్ల షేర్ రేంజికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
This post was last modified on July 15, 2023 12:48 am
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…