చిన్నన్నయ్య కూతురి వివాహ నిశ్చితార్థం వేడుకలో పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం అభిమానుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. నితిన్ వివాహ వేడుకలకు హాజరయిన పవన్ సొంతింట్లో వేడుకను ఎందుకు స్కిప్ చేసాడంటూ ఇతర హీరోల అభిమానులయితే మరింత ట్రోల్ చేస్తున్నారు. ఫ్యామిలీకి దూరంగా వుంటూ ••లిసి వుంటే కలదు సుఖం అంటూ స్పీచ్లిస్తాడని కామెంట్ చేస్తున్నారు. అయితే పవన్ అసలు వేడుకలో మిస్సయ్యాడు కానీ నిహారికకు తన ఆశీస్సులయితే అందించాడట.
పవన్ ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో వున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షలో సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు అడుగు పెట్టనే పెట్టకూడదట. పరమ నిష్టతో పూజలు చేస్తుండాలట. అందుకే ఉదయమే వెళ్లి నిహారికకు ఆశీస్సులు అందించి వచ్చేసాడట. ఈవెంట్ ఫోటోలు బయటకు వచ్చాయి కానీ అవి బయటకు రాలేదు కనుక పవన్ ఎప్పటిలానే కుటుంబ వేడుకను ఊళ్లో వుండి, ఖాళీగా వుండి కూడా స్కిప్ చేసాడనే విమర్శలు వస్తున్నాయి. నాగబాబు తన యూట్యూబ్ వీడియోలో అయినా దీనిపై క్లారిటీ ఇస్తే ఫాన్స్ కాస్త శాంతిస్తారేమో మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates