సినిమాను ప్రమోట్ చేసుకోవడం ఒక కళని ఊరికే అనలేదు పెద్దలు. ముఖ్యంగా డబ్బింగ్ మూవీస్ కి ఇది చాలా కీలకం. ఎల్లుండి విడుదల కాబోతున్న మామన్నన్ తెలుగు వెర్షన్ నాయకుడుని ఒరిజినల్ నిర్మించిన రెడ్ జాయింట్ తో పాటు ఏషియన్, సురేష్ సంస్థలు సంయుక్తంగా ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నాయి. థియేటర్ల కేటాయింపు దాదాపు అయిపోయింది. కొన్ని నగరాలకు ఆన్ లైన్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. కానీ విచిత్రంగా ఈ పేరుతో ఓ మూవీ వస్తోందని ఎవరికీ తెలియనంత నీరసంగా పబ్లిసిటీ చేస్తున్నారు. మరి ఓపెనింగ్స్ ఎలా వస్తాయి.
తమిళనాడులో మామన్నన్ కు మంచి విజయం దక్కింది. బడుగువర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా వడివేలు, అగ్ర కుల మదంతో విర్రవీగే విలన్ పాత్రలో ఫహద్ ఫాసిల్ విశ్వరూపం చూపించారు. హీరో ఉదయనిధి స్టాలిన్ ని ఇద్దరూ కలిసి డామినేట్ చేశారు. హీరోయిన్ కీర్తి సురేష్ వల్ల ఇక్కడి మార్కెట్ లో కొంత బజ్ ని తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన సంగతి సైతం మూవీ లవర్స్ కు రిజిస్టర్ కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్ లో పాటలు వదల్లేదు. మొన్న ట్రైలర్ రిలీజ్ చేయడం తప్ప ఇంకే యాక్టివిటీ లేదు.
కనీసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, మెయిన్ క్యాస్టింగ్ ని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు ఇప్పించడం లాంటివి చేస్తే బజ్ పెరుగుతుంది. అసలే బాక్సాఫీస్ పోటీ తీవ్రంగా ఉంది. మిషన్ ఇంపాజిబుల్ 7, బేబీ, మహావీరుడులు రేస్ లో నిలుచుని కవ్విస్తున్నాయి. కేవలం క్యాస్టింగ్ ని చూసే టికెట్ కొందామనే పరిస్థితులు ఇక్కడ లేవు. ఆ మధ్య వెట్రిమారన్ విడుదల పార్ట్ 1 విషయంలో ఇలాగే నిర్లిప్తత చూపించడం వల్ల జనాలకు చేరలేకపోయింది. అలాంటప్పుడు నాయకుడుకి తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సోషల్ డ్రామాని రజనీకాంత్ స్వయంగా మెచ్చుకున్నారు
This post was last modified on July 12, 2023 1:20 am
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సు(ఆర్థిక సదస్సుగా దీనికి పేరు) రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా పోటా…
ఏపీ విపక్ష పార్టీగా ఉన్న వైసీపీలో జోష్ కనిపించడం లేదు. జగన్ రావాలి.. తమ పార్టీ ముందుకు సాగాలి అన్నట్టుగా…
ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…