ఇప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నవ్విస్తూ వచ్చిన వైవా హర్ష హీరో అయిపోయాడు. చిన్న సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశంతో రవితేజ నిర్మాతగా మారి తీస్తున్న సినిమాల్లో సుందరం మాస్టర్ ఒకటి. కళ్యాణ్ సంతోష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ మీద హాస్య ప్రియుల దృష్టి మెల్లగా పడుతోంది. అలీ, బ్రహ్మానందం, సునీల్, సప్తగిరి లాంటి వాళ్ళందరూ కథానాయకులుగా తమ ప్రతిభని ఋజువు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు వైవా హర్ష సైతం లక్కుని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇందాక టీజర్ ద్వారా కథేంటో చెప్పే ప్రయత్నం చేశారు.
కాన్సెప్ట్ వినూత్నంగా ఉంది. ఎక్కడో మారుమూల అడవుల్లో ఆదివాసీల తెగ లాంటి జనాభా ఉంటుంది. వాళ్లకు ఇంగ్లీష్ నేర్పించే ఉద్దేశంతో సుందరం మాస్టర్(వైవా హర్ష) రోజూ వాళ్ళను పోగేసి ఏరుకొచ్చిన పుల్లలతో ఏబీసీడిలు బోధిస్తాడు. కానీ వాళ్లకేం అర్థం కావు. ఇతను ఇచ్చిన ఖరీదైన బూట్లు, వీడియో గేమ్ కిట్లను ఏం చేయాలో అర్థం కాని అమాయకత్వం వాళ్ళది. అలంటిది ఒక రోజు హఠాత్తుగా గూడెం మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడ్డం మొదలుపెడుతుంది. దెబ్బకు సుందరం ఫ్యూజులు ఎగిరిపోతాయి. తాను 1923లో ఉన్నాననుకుంటే 2023 రేంజ్ లో వాళ్ళు అదరగొడతారు.
ప్రేక్షకులను సస్పెన్స్ లో ఉంచేలా వీడియోని తెలివిగా కట్ చేశారు. క్లూస్ ఇచ్చినట్టే ఇచ్చి వదిలేశారు. పెద్దగా బడ్జెట్ ప్రయాస లేకుండా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సుందరం మాస్టర్ భారం మొత్తం వైవా హర్ష మీదే ఉంది. దీపక్ ఛాయాగ్రహణం, శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ కామెడీ మూవీ రిలీజ్ డేట్ ని టీజర్ లో కన్ఫర్మ్ చేయలేదు. మొత్తానికి స్టార్ ఇమేజ్ లేని కామెడీ నటుడు ఇలా హీరో కావడం కొత్తేమి కాదు కానీ యూట్యూబ్ వైరల్ వీడియోతో మొదలైన హర్ష ప్రయాణం ఇక్కడి దాకా రావడం, అది కూడా రవితేజ బ్యానర్ ద్వారా జరగడం విశేషమే.
This post was last modified on July 11, 2023 8:25 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…