టాలీవుడ్లో ఇప్పుడు పాత సినిమాలను రీ రిలీజ్ చేయడమే కాక.. కొత్త సినిమాలకు రిలీజ్ ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ట్రెండుగా మారింది. కొన్ని సినిమాలు దీని వల్ల ప్రయోజనం పొందితే.. కొన్ని దెబ్బ తిన్నాయి. రెండు వారాల కిందట శ్రీ విష్ణు మూవీ ‘సామజవరగమన’ సినిమాకు ఇలాగే స్పెషల్ ప్రివ్యూలు వేస్తే పాజిటివ్ టాక్ వచ్చి సినిమాకు బాగా కలిసొచ్చింది. ముందే పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర ఆ చిత్రం దూసుకెళ్లింది.
కానీ గత వారం నాగశౌర్య సినిమా ‘రంగబలి’కి ఇలాగే పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే తేడా కొట్టింది. ఆ షోల నుంచే నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో తొలి రోజు ఓపెనింగ్స్ మీద ప్రతికూల ప్రభావం పడింది. సినిమా తర్వాత కోలుకోలేకపోయింది. ఇలా పెయిడ్ ప్రిమియర్స్ ప్లస్ అయిన, మైనస్ అయిన ఉదాహరణలు కనిపిస్తుండగా.. మరో సినిమా ఈ బాటలోనే నడవబోతోంది. అదే.. బేబి.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రల్లో సాయిరాజేష్ రూపొందించిన ‘బేబీ’కి ప్రేక్షకుల్లోనే కాక ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలున్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా మీద చాలా ధీమాగా ఉన్న చిత్ర బృందం.. రిలీజ్ ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్‌కు రెడీ అయిపోయింది.
ఆల్రెడీ హైదరాబాద్‌లో, అలాగే కర్నూలులో ప్రిమియర్స్‌కు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకా పలు నగరాల్లో.. ప్రిమియర్స్ పడబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలోనే షోలు ఉంటాయట. ఈ షోల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా ఊహించని రేంజికి వెళ్లడం ఖాయం. ఒకవేళ టాక్ తేడా కొడితే మాత్రం సినిమాకున్న బజ్ దెబ్బ తింటుంది. ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుంది. వచ్చే వారం రిలీజయ్యే ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’కు కూడా ఇలాగే స్పెషల్ ప్రివ్యూలు ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on July 11, 2023 5:05 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…