కెజిఎఫ్ తో పన్నెండు వందల కోట్ల సినిమాని శాండల్ వుడ్ కు ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న సలార్ మీద ఏ స్థాయిలో అంచనాలు పెట్టాడో చూస్తున్నాం. సెప్టెంబర్ 28 విడుదల కాబోతున్న ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ మీద భారీ ఎత్తున బిజినెస్ జరుగుతోంది. సెకండ్ పార్ట్ సమాంతరంగా పూర్తి చేశారనే టాక్ వినిపిస్తోంది నిజానికి సీక్వెల్ లోని కీలక భాగం డిసెంబర్ నుంచి మొదలుపెడతారట. దీని సంగతలా ఉంచితే నీల్ దీని తర్వాత ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన స్టోరీ లీక్స్ ఇప్పటిదాకా బయటికి రాలేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈసారి ప్రశాంత్ నీల్ మాఫియా జోలికి పోవడం లేదట. ఇప్పటిదాకా తీసినవి నాలుగు అవే జానర్ కావడంతో పూర్తిగా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోబోతున్నట్టు తెలిసింది. స్వాతంత్రం రాకముందు ఇండియా పాకిస్థాన్ సరిహద్దుల్లో జరిగిన పోరాటం ఆధారంగా ఒక కథను తయారు చేశారట. తారక్ వీర దేశభక్తుడిగా హై వోల్టేజ్ పాత్రను పోషించబోతున్నట్టు తెలిసింది. ఆర్ఆర్ఆర్ తరహాలో అనిపించినా అది కేవలం ఒక పాప చుట్టూ నడిచే డ్రామా కాబట్టి దీంతో ఎలాంటి పోలిక ఉండదని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఫోటో షూట్ చేయబోతున్నారు.
ఇది నిజమైతే అంతకన్నా శుభవార్త అభిమానులకు ఇంకేం ఉండదు. మాములుగా ప్రశాంత్ నీల్ హీరోయిజం ఓ రేంజ్ లో ఉంటుంది. దానికి దేశభక్తి తోడైతే ఎలా పేలుతుందో ఊహించుకోవడం కష్టం. ప్రస్తుతం దేవర కోసం డిసెంబర్ దాకా డేట్లు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ లోగానే వార్ 2 కోసం హృతిక్ రోషన్ తో కలిసి సెట్లో అడుగుపెడతాడు. ఈ రెండు అయ్యేలోపు 2024 వేసవి దాటిపోతుంది. అప్పటికంతా సలార్ 2 ఫినిష్ చేసుకున్న ప్రశాంత్ చిన్న గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ 31కి ముహూర్తం పెట్టేస్తాడు. బడ్జెట్ కూడా ఊహించని షాకింగ్ ఫిగర్ తో ఉంటుందని ఫిలిం నగర్ టాక్
This post was last modified on July 11, 2023 1:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…