అప్పుడప్పుడూ కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతుంటాయి. పెద్దగా పేరు లేని ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి చేసిన సినిమా అయినప్పటికీ వాటికి రిలీజ్‌కు ముందే మంచి హైప్ వస్తుంటుంది. టాక్ కూడా తోడైతే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుంటాయి అలాంటి సినిమాలు. గత వారం రిలీజైన ‘సామజవరగమన’ అనే చిన్న సినిమా ఎంత బాగా ఆడుతోందో తెలిసిందే.
ఐతే ఇది చిన్న సినిమానే అయినా.. ఇందులో పేరున్న ఆర్టిస్టులే ఉన్నారు. కానీ వచ్చే వారం రిలీజ్ కానున్న ‘బేబి’ మాత్రం అలా కాదు. ఇందులో ఒక హీరోగా చేసిన ఆనంద్ దేవరకొండది మూడు సినిమాల అనుభవం. హీరోయిన్ వైష్ణవి చైతన్యకు అయితే కథానాయికగా ఇదే తొలి చిత్రం. మరో హీరో విరాజ్ అశ్విన్ చిన్నా చితకా సినిమాలేవో కొన్ని చేశాడు. దీని దర్శకుడు సాయిరాజేష్ ‘హృదయ కాలేయం’ అనే స్పూఫ్ మూవీ ఒకటి తీశాడంతే.
ఇలాంటి కాంబినేషన్లో వస్తున్నప్పటికీ ‘బేబి’ సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉంటోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రతి ప్రోమో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా..’ అంటూ సాగే పాట అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్.. ఇటీవలే లాంచ్ అయిన ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కొంత మేర ‘ఆర్ఎక్స్ 100’తో పోలికలు కనిపిస్తున్నాయి. అందులో ఒక అబ్బాయిని సెక్స్ కోసం వాడుకుని అతడికి నమ్మక ద్రోహం చేసే అమ్మాయి క్యారెక్టర్ కుర్రాళ్లను బాగా డిస్టర్బ్ చేసింది.
ఆ పాత్రను రావు రమేష్ టార్గెట్ చేసిన సన్నివేశానికి థియేటర్లు హోరెత్తిపోయాయి. ఇప్పుడు ‘బేబి’లో హీరోయిన్ పాత్ర కూడా ముందు ఒక అబ్బాయిని ఫ్రేమించి.. తర్వాత మరో అబ్బాయికి ఆకర్షితురాలయ్యేలా కనిపిస్తోంది. ట్రైలర్లో ఆ అమ్మాయి.. ‘‘మేం గుండె మీద కొట్టే దెబ్బ మామూలుగా ఉండదన్నట్లుగా చెప్పిన డైలాగ్ కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే ఉంటుంది. ట్రైలర్ చూశాక సినిమా మీద అంచనాలు పెరగడంతో ఈ నెల 14న థియేటర్లలో బాగానే సందడి నెలకొనబోతోందని అర్థమైంది. యూత్ బాగా కనెక్ట్ అయ్యే కథ కావడం, మంచి మ్యూజిక్ కూడా తోడవడంతో ‘ఆర్ఎక్స్ 100’ తరహాలోనే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.
This post was last modified on July 9, 2023 3:17 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…