మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో మొదలుపెట్టిన గేమ్ ఛేంజర్ మూవీ అనుకున్నంత వేగంగా ముందుకు సాగట్లేదు. మధ్యలో శంకర్ ఇండియన్-2ను పూర్తి చేయాల్సిన పని పడటంతో ఈ సినిమా షూటింగ్ ఆగి ఆగి సాగుతోంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే బుచ్చిబాబు సానాతో చేయాల్సిన కొత్త సినిమాకు సంబంధించి స్క్రిప్టును ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు చరణ్.
స్క్రిప్టు దాదాపుగా పూర్తయినట్లే చెబుతున్నారు. కాస్ట్ అండ్ క్రూ ఎంపిక జరుగుతోందట ప్రస్తుతం. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర అప్‌డేట్స్ గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెనలో విజయ్ సేతుపతి విలన్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ఆ పాత్ర అతి పెద్ద బలంగా నిలిచింది. సేతుపతికి తెలుగులో ఇదొక మరపురాని పాత్రగా నిలిచింది. ఆ అభిమానంతోనే బుచ్చిబాబు తర్వాతి చిత్రంలోనూ ఓ ముఖ్య పాత్ర చేయడానికి సేతుపతి ఓకే చెప్పాడట.
బహుశా ఇది విలన్ పాత్రే అయ్యుంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నాడట. ముందు ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని అనుకున్నపుడే బుచ్చిబాబు రెహమాన్‌ను సంప్రదించడం తెలిసిందే. మరి కథ మారిందా అదేనా అన్నది తెలియదు కానీ.. ఈ సినిమాకు రెహమానే సంగీతం అందించనున్నాడట. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని అంటున్నారు. ఈ చిత్రానికి జాన్వి కపూర్‌ను కథానాయికగా పరిగణిస్తున్నారట.
This post was last modified on July 9, 2023 10:12 am
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…
ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…
‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…