రెండు వారాల సినిమా తీస్తేనే కుర్ర దర్శకులను ఆపలేకపోయే రోజులివి. అలాంటిది కొన్ని వారాల పాటు అలాగే ఓటీటీ లో వచ్చాక కూడా జనం థియేటర్స్ వైపు చూసిన సినిమా తీసి వారి హృదయాలు కొల్లగొట్టిన దర్శకుడిని ఆపగలమా ? ఇప్పుడు సరిగ్గా వేణు అలాంటి ఫీలింగ్ లోనే ఉన్నాడట. కమెడియన్ నుండి దర్శకుడిగా మారి మొదటి సినిమాగా ‘బలగం’ తీసి ప్రేక్షకులకి షాక్ ఇచ్చి అందరి మెప్పు పొందాడు వేణు యల్దండి.
తెలంగాణ నేపథ్యంలో ఒక ఎమోషనల్ డ్రామాగా ‘బలగం’ తీసి తన బలం ఏమిటో చూపించాడు. దీంతో దిల్ రాజు వారసులకి నిర్మాతలుగా ఈ సినిమా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇక అవార్డుల్లో కూడా బలగం సత్తా చాటుతుంది. సినిమా రిజల్ట్ , వచ్చిన రెస్పాన్స్ చూసి దిల్ రాజు వెంటనే వేణుకి రెండో సినిమా ఆఫర్ ఇచ్చాడు. ఈసారి శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లో వేణుకి ఆఫర్ దక్కింది. కథ డిమాండ్ చేస్తే పెద్ద బడ్జెట్ పెట్టేందుకు దిల్ రాజు రెడీగా ఉన్నాడు .
దీంతో వేణు బడ్జెట్ కి తగ్గట్టే ముందు నుండే బడా హీరో కావాలని డిమాండ్ చేస్తున్నాడట. వేణు కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ రెండో సినిమాకి దిల్ రాజు కూడా ఊహించని పేర్లు చెప్తున్నాడట ఈ దర్శకుడు. ప్రస్తుతం రెండో ప్రాజెక్ట్ కూడా తెలంగాణ నేపథ్యంలోనే మరో ఎమోషనల్ డ్రామా రాసుకుంటున్నాడు వేణు. స్క్రిప్ట్ పూర్తి కాకముందే వేణు దిల్ రాజు ను ఫలానా హీరో కావాలని అతను కాకపోతే మరో స్టార్ హీరో తోనే వెళ్దామని అడగడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. ఒకవేళ కథ డిమాండ్ చేస్తే ఆ క్రేజ్ ఉన్న స్టార్ హీరో డేట్స్ సంపాదించడం దిల్ రాజు కి పెద్ద విషయం కాదు. పైగా వేణు బలగంతో అందరినీ మెప్పించాడు. తనపై నమ్మకం ఎలానో ఉంటుంది. కానీ వేణు ముందు నుండే ఫలానా స్టార్ అనుకుంటే మాత్రం బోల్తా కొట్టినట్టే.
బలగం లాంటి మంచి కథ రాసుకొని దానికి తగిన నటీ నటులను ఎంచుకుంటే బాగుంటుంది. అయినా వేణు రాసే ఈ తరహా ఎమోషనల్ కథలు స్టార్ హీరోలు చూసేందుకు ఇష్టపడతారు కానీ చేసేందుకు కాస్త వెనకడుగు వేస్తారు. చూడాలి మరి వేణు రెండో సినిమాకి హీరో ఎవరో ?
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…