బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే దాని క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్న ‘బింబిసార 2’ పై అలాంటి క్రేజ్ నెలకొంటుంది. బింబిసార రిలీజ్ కి ముందే దర్శకుడు వశిష్ట సీక్వెల్ కి పాయింట్ రాసిపెట్టుకున్నాడు. అల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేసుకున్నాడు. కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత ఎందుకో వెంటనే సీక్వెల్ సెట్ అవ్వలేదు. కళ్యాణ్ రామ్ ఆ సినిమా తర్వాత హీరోగా రెండు మూడు ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయాడు. ఈ లోపు దర్శకుడు టాప్ హీరోలకి కథలు చెప్తూ ఆ ప్రాజెక్ట్స్ పై వర్క్ చేయడం మొదలు పెట్టాడు.
దీంతో కళ్యాణ్ రామ్ , దర్శకుడు వశిష్ట మధ్య కొంత దూరం వచ్చిందని తెలుస్తుంది. ‘బింబిసార 2’ కి బడ్జెట్ పెట్టేందుకు జీ స్టూడియోస్ సంస్థ ముందుకొచ్చిందట. దాదాపు 100 కోట్ల పైనే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఇక ఈ బంపర్ ఆఫర్ తో కళ్యాణ్ ఇమిడియట్ గా ఈ సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కానీ వశిష్ట మెగా స్టార్ చిరంజీవి కి ఒక ఫాంటసీ స్టోరీ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు బింబిసార 2 చేయలేని పరిస్థితి. ఇంకా లోలోపల కొన్ని ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తుంది.
ఒక వేళ వశిష్ట రెండో సినిమాగా ‘బింబిసార 2’ కాకుండా మరో సినిమా చేస్తే కళ్యాణ్ రామ్ కి తన రెమ్యూనరేషన్ లో కొంత ఇవ్వాల్సి వచ్చేలా అగ్రిమెంట్ లో ఉందట. ఇక కళ్యాణ్ రామ్ ఆ పాయింట్ తో మరో దర్శకుడిని పెట్టుకొని సీక్వెల్ చేస్తే తనకి కొంత చెల్లించాలని వశిష్ట డిమాండ్ చేస్తున్నాడని టాక్. ఏదేమైనా ఈ ఇష్యూ త్వరలోనే సాల్వ్ చేసుకునే ప్లాన్ రెడీ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.
‘బింబిసార 2’ కి రొమాంటిక్ సినిమా దర్శకుడు అనిల్ పాడురి లాంటి పేర్లు పరీశీలిస్తున్నారు. వీ ఎఫ్ ఎక్స్ వర్క్ లో అనిల్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. బేసిక్ గా తన జాబ్ అదే. పూరీ తన టాలెంట్ గుర్తించి దర్శకుడిగా ఒక సినిమా ఆఫర్ ఇచ్చాడు. దాంతో దర్శకుడిగా మారాడు. బింబిసార2 అనిల్ అయితే వీ ఎఫ్ ఎక్స్ వర్క్ బాగుంటుందని కళ్యాణ్ రామ్ , అతని టీం భావిస్తున్నారట. కళ్యాణ్ రామ్ – వశిష్ట ఇష్యూ సాల్వ్ అవ్వడమే ఆలస్యం ఈ సీక్వెల్ అనౌన్స్ మెంట్ ఉండనుంది.
This post was last modified on July 8, 2023 11:35 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…