సినిమాల్లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడైనా ఆడియన్స్ కి థ్రిల్ ఇచ్చే లైనే. కాకపోతే చాలా రిస్కు ఉంటుంది. హాలీవుడ్ మూవీ బ్యాక్ టు ది ఫ్యూచర్ ని స్ఫూర్తిగా తీసుకుని 1991లో సింగీతం శ్రీనివాసరావు గారు బాలకృష్ణతో ఆదిత్య 369 తీయడం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. సూర్య డ్యూయల్ రోల్ లో విక్రమ్ కుమార్ చేసిన 24 పెద్ద హిట్టు. కళ్యాణ్ రామ్ బింబిసార ఇదే కాన్సెప్ట్ తో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ మధ్య ప్లే బ్యాక్ అనే చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు తీశాడు కానీ ఆశించిన ఫలితం రాలేదు. తాజాగా 7:11 పిఎం అనే వెరైటీ టైటిల్ రూపొందిన మూవీకి మైత్రి అండదండలు అందించారు.
1999 హంసలదీవి అనే ఊరిలో రవి(సాహస్ పగడాల) అనే యువకుడు ఊరు బాగుండాలని కోరుకునే రకం. స్థానిక ఎమ్మెల్యే కృష్ణ(భరత్ రెడ్డి) చెల్లెలు విమలని ప్రేమిస్తాడు. మ్యూచువల్ ఫండ్స్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాని ఆటకట్టించే క్రమంలో ఓ బస్సు ఎక్కుతాడు రవి. తీరా దిగే సమయానికి తాను 2024 అది కూడా ఆస్ట్రేలియాలో ఉన్నట్టు తెలుసుకుని షాక్ తింటాడు. అసలు బస్సు టైం మెషీన్ గా మారడం ఎలా జరిగింది, చివరికి రవి ఏం సాధించాడనేది స్టోరీ. పాయింట్ పరంగా వినగానే బాగుందనిపించే 7:11 పిఎంని దర్శకుడు చైతు మాదాల అంతే ప్రభావంతంగా తెరకెక్కించలేదు
ఫస్ట్ హాఫ్ లో అవసరం లేని బోరింగ్ సన్నివేశాలు చాలా వస్తాయి. స్క్రీన్ ప్లేలో పట్టు లేదు. దీంతో ఆసక్తికరమైన మలుపులకు అవకాశం ఉన్నా అనుభవలేమి వల్ల చైతు నీరసంగా మార్చేశాడు. ద్వితీయార్థంలో కొంత ఆసక్తికరంగా నడిపినా మిగిలిన బలహీనతలు కవర్ కాలేకపోయాయి. పైగా బడ్జెట్ పరిమితులు అడ్డంకిగా నిలిచాయి. వీటికి చోటు విజువల్ ఎఫెక్ట్స్, కొత్త నటీనటుల పెర్ఫార్మన్స్, ఏ మాత్రం ఆసక్తి కలిగించని నెరేషన్ 7.11ని బిలో యావరేజ్ గా మార్చేశాయి. ఆలోచన బాగుంటే సరిపోదు. ఆచరణ గొప్పగా ఉన్నప్పుడే ఇలాంటి ప్రయోగాలు భేష్ అనిపించుకుంటాయి. ఓ మంచి ఛాన్స్ 7:11 వృథా చేసుకుంది
This post was last modified on July 8, 2023 10:25 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…