Movie News

చాలా ముందుగానే ‘సలార్’ ట్రైలర్

రెండు రోజుల ముందే భారీ అంచనాల మధ్య రిలీజైంది ‘సలార్’ టీజర్. ప్రశాంత్ నీల్ చివరి సినిమా ‘కేజీఎఫ్-2’ టీజర్ చూసి ఊగిపోయిన ప్రేక్షకులు.. అదే దృష్టితో ఈ టీజర్ మీద అంచనాలు పెట్టుకున్నారు కానీ.. వాళ్లు ఆశించిన స్థాయిలో అయితే టీజర్ లేదన్నది వాస్తవం. అయినా సరే.. ఈ టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అనేక రికార్డులు నెలకొల్పింది.

రెండు రోజుల వ్యవధిలోనే ‘సలార్’ టీజర్‌ వ్యూస్ ఏకంగా 100 మిలియన్ మార్కును దాటేశాయి. లైక్స్ కూడా రికార్డు స్థాయలో ఉన్నాయి. ఈ ఉత్సాహంలో ‘సలార్’ టీం ట్రైలర్ కబురు చెప్పేసింది. ‘సలార్’ ఫ్యాన్స్ అందరూ ఆగస్టు నెలను మార్క్ చేసి పెట్టుకోవాలని.. ఆ నెలలోనే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నామని ‘సలార్’ నిర్మాణ సంస్థ ‘హోంబలే’ ఫిలిమ్స్ అధికారికంగానే ప్రకటించింది. ‘సలార్’కు వచ్చిన రెస్పాన్స్ చూశాక తాము మరింత కష్టపడి పని చేసి ‘సలార్’ను ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు హోంబలే ఫిలిమ్స్ పేర్కొంది. 

‘సలార్’ రిలీజ్ డేట్ సెప్టెంబరు 28 అన్న సంగతి తెలిసిందే. ఆ డేట్‌కే టీం కట్టుబడి ఉంది. మామూలుగా అయితే రిలీజ్‌కు రెండు మూడు వారాల ముందు ట్రైలర్ లాంచ్ చేస్తుంటారు. కానీ ‘సలార్’ రేంజే వేరు. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతోంది. విదేశాల్లో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాంటపుడు చాలా ముందుగానే ఔట్ పుట్ రెడీ చేయాలి.

అలాగే ప్రమోషన్ల హడావుడి కూడా పెంచాలి. అందుకే నెలన్నర ముందే ఫస్ట్ కాపీ తీయడమే కాక.. ట్రైలర్ కూడా రిలీజ్‌కు కనీసం నెల ముందే రిలీజ్ చేసేయబోతున్నారు. అప్పుడే కోరుకున్న స్థాయిలో హైప్ వస్తుందని అంచనా వేస్తున్నారు. టీజర్ కొంత నిరాశ పరిచిన నేపథ్యంలో ట్రైలర్ విషయంలో ప్రశాంత్ నీల్ కచ్చితంగా జాగ్రత్త పడతాడనడంలో సందేహం లేదు. అసలు సినిమాలోని హైలైట్లను ట్రైలర్ కోసమే ప్రశాంత్ దాచుకుని ఉండొచ్చని కూడా భావిస్తున్నారు.

This post was last modified on July 8, 2023 3:57 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

17 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

4 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

5 hours ago