మన దగ్గర హీరో కావాలంటే ఒడ్డూ పొడుగూ రంగు అన్నీ చూస్తాం కానీ.. తమిళంలో ఆ పరిస్థితి ఉండదు. చాలా మామూలుగా కనిపించే వాళ్లు కూడా హీరోలైపోతుంటారు. ధనుష్ అలా హీరో అయిన వాడే. తొలి సినిమాలో అతణ్ని చూసి ఇతనేం హీరో అనుకున్న వాళ్లే చాలామంది.
కానీ తర్వాత తర్వాత అద్భుతమైన పెర్ఫామెన్స్‌లతో స్టార్‌గా ఎదగడానికి రూపం అడ్డంకే కాదని అతను రుజువు చేశాడు. అతడి స్ఫూర్తితో ఇంకొంతమంది హీరోలయ్యారు. ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ కూడా ఈ కోవకు చెందిన వాడే. అతను తక్కువ ఎత్తుంటాడు. పెద్ద బాడీ కూడా ఉండదు. లుక్స్ కూడా యావరేజే. అయితేనేం ఓవైపు సంగీత దర్శకుడిగా పని చేస్తూనే మరోవైపు హీరోగా సినిమాలు చేశాడు.
‘సర్వం తాళమయం’ సహా కొన్ని సినిమాలు అతడికి చాలా మంచి పేరు తెచ్చాయి. ఇప్పుడతడి చేతిలో ఐదారు సినిమాలుండటం విశేషం. ఏ రోజూ ఖాళీ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడతను. జి.వి.ప్రకాష్ కుమార్ త్వరలోనే హాలీవుడ్లోనూ అరంగేట్రం చేయబోతుండటం విశేషం. అతను ‘ట్రాప్ సిటీ’ అనే ఇంగ్లిష్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. రికీ బర్చెల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఒక డ్రగ్ సరఫరా చేసే కుర్రాడు.. ర్యాపర్‌గా ప్రపంచ స్థాయికి ఎదిగే నేపథ్యంలో సాగే కథ ఇది.
ఇందులో బ్రాండన్ టీ జాక్సన్ లీడ్ రోల్ చేయగా.. ప్రకాష్ ఇందులో డాక్టర్‌గా కనిపించనున్నాడట. దీని ట్రైలర్ కూడా ఆల్రెడీ రిలీజైంది. కరోనా ప్రభావం తగ్గాక ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. రెహమాన్ సంగీత దర్శకుడిగా హాలీవుడ్లో పని చేస్తే ఆయన మేనల్లుడు నటుడిగా హాలీవుడ్లో అరంగేట్రం చేస్తుండటం విశేషమే.
This post was last modified on August 14, 2020 4:37 pm
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…
అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…
ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…