Movie News

రంగు మారిన ‘బేబీ’తో ప్రేమ పోరాటం

ఒక చిన్న సినిమాకు ఎంత ప్రమోషన్లు చేసినా ఆడియన్స్ అటెన్షన్ తీసుకోవడం సులభం కాదు. అలాంటిది మ్యూజిక్ ఆల్బమ్ తో బజ్ తెచ్చుకోవడం అంటే విశేషమే. బేబీ టీమ్ ఈ విషయంలో బాగా సక్సెస్ అయ్యింది. కలర్ ఫోటో నిర్మాతగా నేషనల్ అవార్డు అందుకున్న సాయి రాజేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్కెఎన్ నిర్మించిన ఈ ఎమోషనల్ డ్రామా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా అమీర్ పేట్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో వంశీ పైడిపల్లి, మారుతీ ముఖ్య అతిథులుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. యూత్ లో దీని మీద మంచి అంచనాలున్నాయి.

స్కూల్ వయసులోనే ప్రేమించుకుంటుంది ఓ జంట. అమ్మాయి(వైష్ణవి చైతన్య)కి రంగు తక్కువ. అయినా నిండైన కళ. అబ్బాయి(ఆనంద్ దేవరకొండ)కి చదువు అబ్బదు. పదో తరగతి తప్పి ఆటో డ్రైవర్ గా మారతాడు. అయినా స్నేహం కొనసాగుతుంది. ఈలోగా ధనికుడైన మరో కుర్రాడు(విరాజ్ అశ్విన్)వీళ్ళ జీవితాల్లోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ బేబీ కలర్ మారిపోయి గొప్ప అందగత్తెగా నిలుస్తుంది. అప్పుడు మొదలవుతుంది కన్ఫ్యూజన్. ఇంతకీ ఈ రెండు కథలు సమాంతరంగా జరిగేవా లేక ట్విస్టు ఏదైనా పెట్టారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

యువతను లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముక్కోణపు ప్రేమకథలో విజువల్స్, ఎమోషన్స్ వాళ్లకు తగ్గట్టుగానే ఉన్నాయి. డైలాగులు బాగా రాసుకున్నారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందే హింట్ ఇచ్చే దేవుడు అమ్మాయి విషయంలో మాత్రం ఎందుకు ఇవ్వడని చెప్పడం, గుండెల మీద తన్నాలంటే మాకంటే ఎవరూ ఆ పని చేయలేరని వైష్ణవితో చెప్పించడం పేలాయి. ముందు నుంచి బేబీ హైప్ లో ప్రధాన పిల్లర్ గా నిలుస్తున్న విజయ్ బుల్గనిన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా మారబోతున్నాయి. ఆలస్యమైనా మంచి టైమింగ్ చూసుకుని వస్తున్న బేబీలో క్లిక్ అయ్యే కంటెంట్ కనిపిస్తోంది 

This post was last modified on July 7, 2023 8:12 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 minutes ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

2 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

8 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

8 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 hours ago