సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కోట్ల బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు నిర్మించడంలో ఓటిటిలు విపరీతంగా పోటీ పడుతుంటాయి. వాటిలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించిన సిటాడెల్ కొన్ని నెలల క్రితమే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సుమారు 250 మిలియన్ డాలర్ల దాకా ఖర్చు పెట్టారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 2 వేల కోట్లన్న మాట. ఎవెంజర్స్ తీసిన రస్సో బ్రదర్స్ కథను అందించడం వల్ల దీనికి ఇంత క్రేజ్ వచ్చింది. ప్రైమ్ దీని మీద బోలెడు ఆశలు పెట్టుకుంది.
తీరా చూస్తే సిటాడెల్ అంచనాలు అందుకోలేదు. మిక్స్డ్ రివ్యూస్, బ్యాడ్ టాక్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని ప్రైమ్ పెద్దలు తెగ బాధపడుతున్నారని టాక్. దీన్నే ఇండియన్ వెర్షన్ కోసం దర్శకులు రాజ్ అండ్ డికెలు వరుణ్ ధావన్, సమంతాతో రీమేక్ చేశారు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ప్రధాన కథ అదే కానీ మన ఆడియన్స్ కి తగ్గట్టు కొన్ని కీలక మార్పులు చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు కావడంతో అంచనాలు మాములుగా లేవు. అయితే ఒరిజినల్ వెర్షన్ ఫ్లాప్ కావడం ఎవరూ ఊహించలేదు.
ఈ పరిణామాల పట్ల అమెజాన్ ప్రైమ్ బాగా సీరియస్ గా తీసుకుని ఇలాంటి రిజల్ట్ ఇచ్చిన వెబ్ సిరీస్ లను రెన్యువల్ చేయడం ఆపాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. అంతే కాదు కంటెంట్ సెలక్షన్ లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రోగ్రాం కూడా పెట్టిందని వినికిడి. కరోనా టైంలో ఇలాగే ముందు వెనుకా చూడకుండా కోట్లు కుమ్మరించి కొన్న భారతీయ సినిమాలు డిజాస్టరై పెద్ద షాక్ ఇవ్వడంతో ఆ తర్వాత తొందరపడి కొనడం ఆపేసింది. చాలా క్యాలికులేషన్లతో నిర్మాతలతో బేరాలు పెడుతోంది. ఏదైనా వాత పడితేనే కదా తెలిసేది నొప్పి ఎలా ఉంటుందో
This post was last modified on July 7, 2023 11:01 am
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…