ఒకప్పటిలా ఇప్పుడు వంద రోజులు, సిల్వర్ జూబ్లీలు చూడటం అరుదైపోయింది కానీ స్టార్ హీరోల అభిమానుల వల్ల కొన్ని అరుదైన మైలురాళ్ళు సాధ్యమవుతున్నాయి. బాలయ్యకు అలాంటి ఓ రికార్డు సొంతమైంది. సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి వసూళ్ల పరంగా ఆయన కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా 175 రోజులు దాటేసిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, ఆలూరు పట్టణం శ్రీ లక్ష్మినరసింహా థియేటర్ లో రోజు 4 ఆటలతో జూలై 5వ తేదీన ఈ లాంఛనం పూర్తి చేసుకుంది. ఒక సి సెంటర్లో ఈ రన్ దక్కడం ఘనతే.
అయితే అసలు విశేషం ఇది కాదు. వరసగా డబుల్ యాక్షన్ చేసిన ఒకే హీరో రెండు సినిమాలు సిల్వర్ జూబ్లీ చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, కృష్ణ లాంటి స్టార్ల చిత్రాలు నూటా డెబ్భై అయిదు రోజులు చాలానే ఆడాయి కానీ బ్యాక్ టు బ్యాక్ ద్విపాత్రాభినయాలు ఆడటం మాత్రం ఇండియాలోనే ఇది మొదటిసారని అభిమానులు అంటున్నారు. వెనక్కు వెళ్లి చూస్తే ఇద్ నిజమే అనిపిస్తోంది. వీరసింహారెడ్డి హాట్ స్టార్ ఓటిటిలో వచ్చి నెలలు దాటేసింది. అయినా కూడా కొత్త సినిమాల తాకిడిలో ఇంత లాంగ్ రన్ అనూహ్యం.
ఫ్యాన్స్ అండదండలతో ఇది సాధ్యమయ్యిందేమో అనుకున్నా సినిమా ఆడుతున్నన్ని రోజులు జనాలు బాగానే వచ్చారని లోకల్ రిపోర్ట్. మొత్తానికి బాలయ్య ఖాతాలో దగ్గరి భవిష్యత్తులో ఇంకెవరికి సాధ్యం కాని ఒక అరుదైన రికార్డు దక్కింది. అఖండ, వీరసింహారెడ్డిల తర్వాత ఇప్పుడు మరింత జోష్ తో భగవంత్ కేసరిగా అక్టోబర్ లో రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ హ్యాట్రిక్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అర్జున్ రామ్ పాల్ విలన్ గా, శ్రీలీల మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
This post was last modified on July 6, 2023 12:48 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…