ఈ మధ్యకాలంలో అసలు విడుదల తేదీకి ఒకటి రెండు రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్లు వేయడం మంచి ఫలితాన్ని ఇస్తోంది. హీరో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికంటే ముందుగా చూస్తున్నామనే ఫీలింగ్ ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొస్తోంది. అందులోనూ ఇవన్నీ ఈవెనింగ్ షోలు కావడంతో హౌస్ ఫుల్స్ కి ఢోకా ఉండటం లేదు. సామజవరగమన, మేం ఫేమస్, మేజర్, రైటర్ పద్మభూషణ్, బలగం, ఇంటింటి రామాయణం, 777 ఛార్లీ వగైరాలు ఎర్లీ స్క్రీనింగ్ కి వెళ్ళినవే. ఒకటి రెండు తప్ప దాదాపు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి.
అందుకే రంగబలి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలని డిసైడ్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన నగరాల్లో స్పెషల్ షోలు వేయాలని హఠాత్తుగా నిర్ణయం తీసుకుని బుధవారం రాత్రి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. నిజానికి ఈ ప్రమోషన్ ఏదో ఇంకాస్త ముందే చేసి ఉంటే రీచ్ పెరిగేది. నాగశౌర్య ఇమేజ్ ఉన్న హీరోనే కాబట్టి రెస్పాన్స్ కి సంబంధించి టెన్షన్ లేదు కానీ ఈ రోజు అర్ధరాత్రిలోపే టాక్ రావడం రేపటి ఓపెనింగ్స్ కి కీలకంగా మారనుంది. కమెడియన్ సత్య స్పూఫ్ ఇంటర్వ్యూ, శౌర్యతో డాన్స్ మాస్టర్ జానీలు కలిసి చేసిన పవన్ పాట రీమిక్స్ పబ్లిసిటీలో ఉపయోగపడ్డాయి
రేపు ఎంతపోటీ ఉన్నా కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ ఉన్న సినిమా ఇదొక్కటేననే నమ్మకంతో నాగశౌర్య టీమ్ ప్రీమియర్లకు రెడీ అయిపోయింది. ఊహించని సర్ప్రైజులు సినిమాలో చాలానే ఉంటాయని ఊరిస్తోంది. పవన్ బసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన రంగబలిలో దసరా ఫేమ్ షైన్ టామ్ చాకో విలన్ గా నటిస్తున్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగానే ఉన్నప్పటికీ పికప్ అయ్యే టాక్ మీదే వసూళ్లు ఆధారపడి ఉంటాయి. గత కొంత కాలంగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న నాగ శౌర్య రంగబలి విషయంలో మాత్రం బ్లాక్ బస్టర్ కి తగ్గదంటున్నాడు. చూడాలి మరి.
This post was last modified on July 6, 2023 10:04 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…