ఈ ఏడాది జనవరి 25కు ముందు షారుఖ్ ఖాన్ పరిస్థితి అగమ్యం గోచరం. గత పదేళ్లలో నిఖార్సయిన హిట్ ఒక్కటీ లేక షారుఖ్ ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. ముఖ్యంగా గత ఐదారేళ్లలో అయితే షారుఖ్ పరిస్థితి దయనీయంగా మారింది. జీరో సినిమా అతడి మార్కెట్‌ను దారుణంగా దెబ్బ తీసింది. ఆ సినిమా ఫలితం చూసి షారుఖ్ పనైపోయినట్లే అని చాలామంది తీర్మానించేశారు.
కానీ ఈ ఏడాది రిపబ్లిక్ డే వీకెండ్లో రిలీజైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మామూలు మోత మోగించలేదు. సినిమాలో ఉన్న కంటెంట్‌ను మించి ఈ సినిమా వసూళ్లు రాబట్టింది. ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. దీందో కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ షారుఖ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ ఒక్క సినిమా షారుఖ్ కెరీర్‌ను ఒక్కసారిగా గొప్ప మలుపు తిప్పిందనే చెప్పాలి.
మంచి హైప్ తెచ్చుకుని థియేటర్లలో ఇరగాడేసిన పఠాన్ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.210 కోట్ల ఆదాయం రావడం విశేషం. బాలీవుడ్లో అత్యంత పెద్ద నాన్ థియేట్రికల్ డీల్స్‌లో ఇది ఒకటి. షారుఖ్ హంగామా ఇంతటితో అయిపోలేదు. పఠాన్ ఆయన తర్వాతి సినిమాల బిజినెస్‌కు కూడా మంచి బూస్ట్ ఇచ్చింది. కింగ్ ఖాన్ తర్వాతి సినిమా జవాన్ నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.250 కోట్లు పలికినట్లు సమాచారం. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం.. నయనతార, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషించడంతో సౌత్‌లో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది.
దీంతో నాన్ థియేట్రికల్స్ అనూహ్యమైన రేటు తెచ్చాయి. తాజా సమాచారం ఏంటంటే.. షారుఖ్ చేస్తున్న కొత్త సినిమా డంకికి ఆరంభ దశలోనే నాన్ థియేట్రికల్ డీల్ పూర్తయిందట. రాజ్ కుమార్ హిరాని రూపొందిస్తున్న ఈ సినిమాకు రూ.230 కోట్ల రేటు పలికిందట. ఈ డీల్స్ అన్నీ ఏడాది వ్యవధిలో జరిగినవి. మొత్తం మూడు సినిమాలకు కలిపి దాదాపు రూ.700 కోట్లు నాన్ థియేట్రికల్స్ ద్వారా రావడం అంటే షారుఖ్ సత్తా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on July 6, 2023 10:00 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…