ఏడాదిగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. లాంఛనం అనుకున్న పరిణామం జరిగిపోయింది. మెగా ఫ్యామిలీ అమ్మాయి, నాగబాబు తనయురాలు కొణిదెల నిహారిక.. తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్న విషయం అధికారికం అయింది. రెండు రోజుల ముందే వీరి విడాకులకు సంబంధించిన దరఖాస్తులు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి.
చైతన్య, నిహారిక వేర్వేరుగా తమ విడాకుల గురించి స్టేట్మెంట్లు మీడియాకు రిలీజ్ చేశారు. విడిపోతూ కూడా ఇద్దరూ ఒకే రకమైన మెసేజ్‌లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. మంచి జంట అవుతారనుకున్న వీళ్లిద్దరూ పెళ్లయి మూడేళ్లు తిరక్కుండానే ఇలా విడాకులు పొందడం మెగా అభిమానులకు బాధ కలిగిస్తోంది. కానీ వాళ్లిద్దరికీ కుదరనపుడు ఎవరూ చేసేదేమీ లేదు.
ఇదిలా ఉంటే.. నిహారికకు విడాకులు ఇప్పించిన లాయర్ ఎవరనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జనసేన మద్దతుదారుడు, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకర.. ఈ విడాకుల కేసులో నిహారిక తరఫున లాయర్‌గా వ్యవహరించడం విశేషం. విడాకుల డాక్యుమెంట్‌లో నిహారిక లాయర్‌గా తన పేరే ఉంది. ఒకప్పుడు జనసేనలో సభ్యుడిగా ఉన్న దిలీప్ సుంకర.. కొన్ని వివాదాల వల్ల బయటికి వెళ్లిపోయాడు.
కానీ ఆ పార్టీ మద్దతుదారుగానే కొనసాగుతున్నాడు. ఓవైపు హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేసుకుంటూనే కామనర్ లైబ్రరీ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి జనసేన వైరి వర్గాల మీద విరుచుకుపడుతుంటాడు దిలీప్. ఆ పార్టీ మద్దతుదారుల కేసులు కూడా అతను వాదిస్తుంటాడు. నిహారిక తండ్రి నాగబాబుతో దిలీప్‌కు సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే ఆయన కూతురి విడాకుల కేసును టేకప్ చేశాడని అర్థమవుతోంది.
This post was last modified on July 6, 2023 7:05 am
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…