Movie News

నోలన్ క్రేజుకి మతి పోవాల్సిందే

హాలీవుడ్ సినిమాలంటే ఎంత పిచ్చి ఉన్నా మన మూవీ లవర్స్ కి ఆయా దర్శకుల గురించి తెలిసింది తక్కువే. చాలా అరుదుగా వాళ్ళను గుర్తు పెట్టుకుంటారు. కానీ కొన్ని పేర్లు మాత్రం శాశ్వత ముద్ర వేసి తిరుగులేని ఫాలోయింగ్ ని సృష్టించి పెడతాయి. స్టీవెన్ స్పీల్బర్గ్ మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. కానీ ఇప్పటి జనరేషన్ మాత్రం క్రిస్టోఫర్ నోలన్ కు ఫిదా అవుతున్నారు. మెదడుని మెలితిప్పే క్లిష్టమైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దిట్టగా పొగడబడే ఆయన కొత్త మూవీ ఓపెన్ హెయిమర్ ఈ నెల 21న విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా దీని కోసం ఎదురు చూపులు మాములుగా లేవు.

ఇండియాలో రెండు వారాలకు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ పెడితే టికెట్లు నిమిషాల్లో అయిపోతున్నాయి. ముఖ్యంగా పెద్ద స్క్రీన్లున్న ఐమాక్స్ లకు చకచకా సోల్డ్ అవుట్ లు పడుతున్నాయి. న్యూక్లియర్ ప్రయోగాలు ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో చూపించే పాయింట్ మీద  ఓపెన్ హెయిమర్ ని రూపొందించారు. మూడు గంటల ఎనిమిది నిమిషాల సుదీర్ఘ నిడివితో నోలన్ కెరీర్ లోనే అతి పెద్ద సినిమాగా ఇది ప్రత్యేకత సంతరించుకుంది. ట్రేడ్ టాక్ ప్రకారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ఇప్పటిదాకా ముప్పై వేల టికెట్లు పైగానే అమ్ముడుపోయాయట.

ఇది అరుదైన రికార్డు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ సమయానికి మతి పోయే ఫిగర్స్ నమోదు కావడం ఖాయమే. గతంలో ఇంటర్ స్టెల్లార్, టెనెట్ లాంటి కాంప్లికేటెడ్ చిత్రాలను సైతం భారతీయులు బ్రహ్మాండంగా ఆదరించారు. నోలన్ మీద ఇంత ఆరాధనా భావం రావడానికి కారణం ఇన్సెప్షన్ తో పాటు డార్క్ నైట్ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు. ఇవి మాములు బ్లాక్ బస్టర్ అవ్వలేదు. అప్పటి నుంచి ఈ క్రియేటివ్ జీనియస్ కి ఫాలోయింగ్ పెరిగిపోయించి. అన్నట్టు ఈ ఓపెన్ హెయిమర్ ని చూసేందుకు సెలబ్రిటీలు కూడా ఎగబడుతున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక షోల ప్లాన్నింగ్ జరుగుతోంది 

This post was last modified on July 5, 2023 7:47 pm

Share

Recent Posts

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

6 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

41 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

45 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

1 hour ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

5 hours ago