రంగబలి ప్రమోషన్లలో భాగంగా టీవీ, మీడియా సెలబ్రిటీలను అనుకరిస్తూ కామెడీ సత్య చేసిని స్పూఫ్ ఇంటర్వ్యూ ప్రోమో ఎంత వైరల్ అయ్యిందో చూశాం. దెబ్బకు అతను ఎవరినైతే ఇమిటేట్ చేశాడో వాళ్లలో ఒకరిద్దరు హర్ట్ అయ్యారని, అందుకే యూట్యూబ్ స్ట్రీమింగ్ ఆగిపోయిందని పెద్ద ప్రచారమే జరిగింది. అందులో నిజం ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరనేది మాత్రం బయటికి తెలియలేదు. నాలుగు రోజుల క్రితమే రావాల్సిన ఫుల్ వెర్షన్ కేవలం ఈ వివాదం వల్ల ఆగిపోయింది. ఇది వదిలితే కానీ రంగబలి సినిమా చూడమని కొందరు ట్వీట్లు చేయడం వైరల్ గా మారింది.
ఎట్టకేలకు నిర్మాణ సంస్థ పూర్తి ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది. కాకపోతే ఎడిట్ చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో కేవలం 8 నిమిషాల ఫుటేజ్ మాత్రమే ఉంది. ఓపెన్ హార్ట్ విత్ సత్య అంటూ ఓ మీడియా అధిపతిని, ఇంటర్వ్యూ విత్ దేవీప్రియా అంటూ మరో వెబ్ యాంకర్ ని అనుకరించిన రెండు ఎపిసోడ్లు ఇందులో పెట్టారు. రెండో పార్ట్ రేపో ఎల్లుండో విడుదల చేస్తారు. సత్య బాడీ లాంగ్వేజ్, మిమిక్రి అనుకరణ అచ్చం దిగిపోయింది. ప్రశ్నలు అడిగే తీరు, కొన్ని వివాదాస్పద అంశాలను ప్రస్తావించినప్పుడు ఆ హావభావాలను అనుకరించడం మొత్తం పర్ఫెక్ట్ గా వచ్చాయి.
కమెడియన్ గా ఈ ప్రమోషన్ తనకు బాగా ఉపయోగపడుతుందని సత్య నమ్ముతున్నాడు. దానికి తగ్గట్టే ట్విట్టర్, ఇన్స్ టాలో ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇంకో మూడు రోజుల్లో రాబోతున్న రంగబలి పబ్లిసిటీ పరంగా ఏ అవకాశాన్ని వదిలేందుకు సిద్ధంగా లేరు. బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నప్పటికీ అన్నీ చిన్న చిన్న సినిమాలే కావడంతో పాజిటివ్ టాక్ వస్తే డామినేట్ చేయొచ్చు. నాగ శౌర్య మాత్రం యావరేజ్ హిట్టు కాదని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతామని నమ్మకంగా చెబుతున్నాడు. షైన్ టామ్ చాకో విలనీతో పాటు పవన్ కళ్యాణ్ రెఫెరెన్సులు కంటెంట్ కి తోడ్పడుతున్నాయి.
This post was last modified on July 4, 2023 2:33 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…