లో బడ్జెట్ సినిమాలతో తెలుగమ్మాయి ఈషా రెబ్బా కుర్రకారులో అభిమానులను బాగానే సంపాదించుకుంది. ఎన్టీఆర్ సినిమాలో నటించేంతగా దర్శకుల దృష్టిలో పడింది. అయితే ‘అరవింద సమేత’లో చేసిన చిన్న పాత్ర ఆమెకు కెరియర్ పరంగా ఎలాంటి పుష్ ఇవ్వలేకపోయింది.
పక్కింటి అమ్మాయి ఇమేజ్ వుంటే అవకాశాలు ఎక్కువగా రావడం లేదని తనలోని గ్లామర్ కోణం తెలిసేలా ఈషా ఇన్‍స్టాగ్రామ్ పేజీని సెక్సీ ఫోటోలతో నింపేసింది. అయితే ఆమె ఎంతగా ప్రయత్నించినా చిన్న సినిమాలు మినహా చెప్పుకోతగ్గ అవకాశాలేమీ రాలేదు. దీంతో ఈషా వెబ్ సిరీస్‍లపై దృష్టి పెట్టింది. లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్‍లో చాలా బోల్డ్ క్యారెక్టర్ చేస్తోన్న ఈషా సంపత్ నంది చేస్తోన్న సిరీస్‍లో కాల్ గాళ్ క్యారెక్టర్ చేస్తోంది.
ఒక కాల్ గాళ్ జీవితంలోని మూడు దశలు ఈ సిరీస్‍లో చూపిస్తారు. చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అంటూ ఈషా ఎక్సయిట్ అవుతోంది. గ్లామర్ హీరోయిన్‍గా అవకాశాలు వస్తాయని చేసిన ఫోటో సెషన్లు ఈషాకు ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్లు తెచ్చిపెడుతున్నాయి. ఈ తరహా సిరీస్‍కి వ్యూయర్‍షిప్ ఎక్కువ కనుక ఈషాకి ఈ రంగంలో సక్సెస్ ఈజీ అవుతుందనే అనిపిస్తోంది. అయితే అన్నీ ఈ తరహా కథలకే పరిమితం కాకుండా తన పక్కింటి అమ్మాయి ఇమేజ్‍ని కూడా కాపాడుకుంటే మంచిది.
This post was last modified on August 14, 2020 8:56 am
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…
పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…
ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…