కరోనా-లాక్‌డౌన్ టైంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికీ పెదద్ షాకే ఇచ్చింది. తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లాడింది. ఇంకా కెరీర్ బాగా సాగుతుండగానే.. చేతిలో పెద్ద సినిమాలు ఉండగానే కాజల్ ఉన్నట్లుండి పెళ్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే కాజల్ ఆ టైంలో పెళ్లి చేసుకోవడమే కాదు.. రెండేళ్ల లోపే ఒక బిడ్డను కూడా కనేసింది. ఆపై మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి బిజీ అయ్యే ప్రయత్నంలో ఉంది.
ఐతే తన పెళ్లికి సంబంధించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చందమామ ఆసక్తికర విషయం వెల్లడించింది. గౌతమ్‌తో ఆమె పెళ్లి తన తండ్రికి ఇష్టమే లేదట. ఆయన్ని అతి కష్టం మీద ఒప్పించాల్సి వచ్చిందట. ఇందుకు కారణమేంటో కాజల్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ‘‘గౌతమ్ నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు. ఏడేళ్ల పాటు మా స్నేహం సాగింది. ఈ క్రమంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది.
కానీ ఎవ్వరూ మనసులో మాటను బయటపెట్టలేదు. ఇద్దరం మనసులోనే ప్రేమను దాచుకున్నాం. కానీ కరోనా మా ఇద్దరినీ కలిపింది. ఆ టైంలో ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాం. అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇద్దరం మా ఇళ్లలో విషయం చెప్పాం. మా అమ్మ సులువుగానే ఒప్పుకుంది. కానీ నాన్న పెళ్లికి ససేమిరా అన్నారు.
మా ఇద్దరి ప్రొఫెషన్లు వేరు కావడంతో మేం కలిసి ఉండగలమా.. పెళ్లి తర్వాత ఏమవుతుందో అని ఆయన కంగారు పడ్డారు. కానీ మా అమ్మ ఆయనకు నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించింది. కొన్ని రోజుల తర్వాత మా పెళ్లికి లైన్ క్లియర్ అయింది. ఐతే పెళ్లి తర్వాత గౌతమ్ ఆయనకు చాలా నచ్చాడు. ఇప్పుడు తనను కొడుకులా చూసుకుంటున్నారు. వాళ్ల అనుబంధం చూస్తే నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది’’ అని కాజల్ వెల్లడించింది.
Show quoted text
This post was last modified on July 3, 2023 7:54 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…