ఆదిపురుష్ ఫలితం నిరాశపరిచినా ప్రభాస్ స్టామినాని రుజువు చేయడంలో మాత్రం ఫెయిల్ కాలేదు. డిజాస్టర్ తో కూడా రెండు మూడు వందల కోట్లు మంచి నీళ్లు తగినంత సులభంగా రాబట్టగలనని మరోసారి నిరూపించాడు. ఇప్పుడు అందరి కళ్ళు సలార్ మీదే ఉన్నాయి. కెజిఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు. బిజినెస్ ఆఫర్లు క్రేజీగా వస్తున్నాయి. లీకైన వీడియోలు, స్టిల్స్ చూసే ఫ్యాన్స్ ఆకాశమే హద్దుగా దీని గురించి ఊహించుకుంటున్నారు. ఇప్పుడు ప్రమోషన్లలో మొదటి అడుగు పడబోతోంది.
సలార్ టీజర్ ఈ జూలై 6 తెల్లవారుఝామున 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. ఏదో ముహూర్తం చూసి ఫిక్స్ చేయించినట్టున్నారు. మాములుగా విడుదల రోజు బెనిఫిట్ షోలు ఈ టైంకి మొదలవుతాయి. అలాంటిది టీజర్ కి ఈ సమయాన్ని లాక్ చేయడం ఆశ్చర్యమే. అంటే ఫ్యాన్స్, మీడియా వర్గాలు, మూవీ లవర్స్ అందరూ అలారం పెట్టుకుని లేవాల్సిందే. తర్వాతైనా చూసుకోవచ్చు కానీ ఎగ్జైట్ మెంట్ మిస్ అయిపోతుంది. ఈలోగా ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్స్ లో మోత మ్రోగిపోతుంది. అలా జరగకూడదంటే లేవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు
ఈ వీడియో ద్వారానే బిజినెస్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతుందని నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ ఆశిస్తోంది. ఇంకా ఏరియాల వారిగా హక్కులను పూర్తిగా విక్రయించలేదు. డిస్ట్రిబ్యూటర్ల మధ్య పోటీని విశ్లేషించి నిర్ణయం తీసుకోబోతున్నారు. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం చూడలేకపోయిన ప్రభాస్ కి ఆ లోటు సలార్ పూర్తిగా తీరుస్తుందనే నమ్మకం హీరోతో పాటు అభిమానుల్లోనూ బలంగా కనిపిస్తోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సలార్ లో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు మెయిన్ విలన్లు. ఒక భాగమా లేక సీక్వెల్ ఉంటుందానే సస్పెన్స్ కూడా మూడు రోజుల్లో తేలిపోతుంది
This post was last modified on July 3, 2023 4:31 pm
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…