ఓటిటి రిలీజ్ అంటే చిన్నతనంగా ఫీలవుతోంది తెలుగు చిత్ర పరిశ్రమ. అది కేవలం చిన్న సినిమాల కోసం వున్న మాధ్యమమని, సినిమా థియేటర్లలో కాకుండా ఓటిటి ద్వారా సినిమాలు విడుదల చేస్తే హీరోలుగా తమ పరపతి తగ్గిపోతుందని భయాలున్నాయి. అయితే థియేటర్లు తెరుచుకోవడానికి మరెన్ని నెలలు పడుతుందో తెలియని పరిస్థితిలో పూర్తయిన సినిమాలను అలా పెట్టుకుని కూర్చుంటే ఆర్థిక భారం మినహా ఒరిగేదేమీ వుండదు. అందుకే రిలీజ్ కాకుండా వుండిపోయిన మీడియం బడ్జెట్ సినిమాలన్నీ ఓటిటి బాట పడుతున్నాయని బలంగా వినిపిస్తోంది.
ఇంకా నిర్మాతలు, హీరోలు, ఓటిటి సంస్థల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ నాని ‘వి’ చిత్రం సెప్టెంబర్‍లో అమెజాన్ ప్రైమ్‍లో ప్రీమియర్ అవుతుందని టాక్. నాని లాంటి గ్యారెంటీ మార్కెట్ వున్న హీరో సినిమా ఓటిటిలో వస్తే ఇక మిగిలిన మధ్య శ్రేణి హీరోలకి అభ్యంతరం ఏముంటుంది. నానితో పాటు రామ్ రెడ్, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ కూడా ఓటిటి బాట పడుతున్నట్టు వినిపిస్తోంది. ఇవి కాకుండా మరో నాలుగైదు సినిమాల హక్కులను భారీ రేట్ ఆఫర్ చేసి తీసుకున్నారట. థియేటర్లు తెరిచాక ఈ సినిమాలకు మీడియం రేంజ్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటారని టాక్.
This post was last modified on August 14, 2020 4:38 am
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…
పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…
ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…