గత ఏడాది ప్రిన్స్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్. తెలుగు దర్శకుడు, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళఃలో మంచి మంచి సినిమాలు చేసిన శివకు తెలుగు అరంగేట్రంలో సరైన సినిమా పడలేదు. అయినా అతను నిరాశ చెందకుండా మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అదే.. మహావీరుడు. తమిళంలో మావీరన్ పేరుతో తెరకెక్కిన చిత్రమిది. మండేలా అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రశంసలు అందుకున్న మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 14నే తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీని ట్రైలర్ లాంచ్ చేశారు. అది ఆద్యంతం వినోదాత్మకంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అత్యంత పిరికివాడైన ఓ కుర్రాడు.. చాలా ధైర్యవంతుడిలా ప్రొజెక్టవ్వడం.. అతడికి ఒక రాజకీయ పార్టీ అధినేతతో గొడవ మొదలవడం.. అనూహ్య పరిణామాల మధ్య అతను తనకు తెలియకుండానే ధైర్యవంతుడిగా మారి ఆ రాజకీయ నేతకు సవాలు విసరడం.. ఈ నేపథ్యంలో సాగే సినిమా ఇది. హీరో పాత్రకు సంబంధించి పెద్ద ట్విస్టేదో ఉన్నట్లుగా ట్రైలర్లో చూపించారు కానీ.. ఆ ట్విస్టు పూర్తిగా ఓపెన్ చేయలేదు.
విలన్ పాత్రలో ప్రముఖ దర్శకుడు మిస్కిన్ నటించాడు. అతడి పాత్ర బాగానే హైలైట్ అయ్యేలా ఉంది. శివ కార్తికేయన్ తనదైన శైలిలో పెర్ఫామ్ చేసినట్లున్నాడు. తెలుగు కమెడియన్ టర్న్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్ ఇందులో ఓ కీలక పాత్ర చేయడం విశేషం. నిన్నటితరం నటి సరిత హీరో తల్లిగా అదరగొట్టింది. హీరోయిన్‌గా శంకర్ తనయురాలు అదితి నటించిందీ చిత్రంలో. ట్రైలర్ చూస్తే సినిమాలో హిట్టు కళ కనిపిస్తోంది.
This post was last modified on July 3, 2023 10:38 am
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…