వచ్చే నెల 11న విడుదల కాబోతున్న భోళా శంకర్ కి యానిమల్ వాయిదా పడటం పెద్ద రిలీఫ్ కలిగిస్తోంది. చిరంజీవికి రన్బీర్ కపూర్ కి పోటీ ఏంటనే సందేహం రావొచ్చు కానీ బాక్సాఫీస్ లెక్కలను చూసుకుంటే మ్యాటర్ అర్థమవుతుంది. భోళా శంకర్ రీమేక్ కావడం, దర్శకుడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు ముందు నుంచే ఒకరకమైన నెగటివిటీని మోసుకొస్తున్నాయి. ఇటీవలే వదిలిన టీజర్ కూడా రొటీన్ గానే ఉంది తప్ప ఎలాంటి ప్రత్యేకమైన ఫీలింగ్ కలిగించలేదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమయింది. ఇంత ప్రతికూలత ఉండటం చిన్న విషయం కాదు.
ఏపీ, తెలంగాణల సంగతి పక్కనపెడితే సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ ఓవర్సీస్ లో చాలా బలంగా ఉంది. అర్జున్ రెడ్డి తాలూకు ఎఫెక్ట్ అది. యానిమల్ మీద యుఎస్ లాంటి దేశాల్లో విపరీతమైన అంచనాలున్నాయి. రెగ్యులర్ భోళా శంకర్ కన్నా వైల్డ్ కంటెంట్ ఉన్న రన్బీర్ కే ఓటేద్దామని ప్రవాసీయులు నిర్ణయించుకుంటే దెబ్బ తప్పదు. చిరు మార్కెట్ ఎంత లాకొచ్చినా కాంపిటీటర్ బలంగా ఉన్నప్పుడు వ్యవహారం ఆషామాషీగా ఉండదు. పైగా కర్ణాటక తప్ప తెలుగు రాష్ట్రాల బయట మెగాస్టార్ బ్రాండ్ అంతగా పని చేయదు. అలాంటప్పుడు యానిమల్ ని తేలికగా తీసుకోవడానికి లేదు.
ఇంత జరిగినా గండం పూర్తిగా తొలగలేదు. ఆగస్ట్ 10 రజనీకాంత్ జైలర్ వచ్చేస్తుంది. 11న సన్నీ డియోల్ గదర్ ఏక్ ప్రేమ్ కథ 2 రాబోతోంది. దీని మీద మాస్ వర్గాల్లో బజ్ ఉంది. యానిమల్ తో పోల్చుకుంటే యూత్ లో వీటి మీద హైప్ తక్కువే కాబట్టి మరీ ఆందోళన చెందాల్సిన పని లేదు. క్రేజ్ ఎక్కువ తక్కువల సంగతి పక్కనపెడితే భోళా శంకర్ బిజినెస్ మాత్రం జోరుగానే సాగుతోందని ట్రేడ్ టాక్. నైజాం, ఆంధ్రా హక్కులను నిర్మాత ఎక్కువ డిమాండ్ చేస్తున్నా డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారట. వాల్తేరు వీరయ్య సక్సెస్ పుణ్యమాని రేట్లు అటుఇటుగా ఉన్నా సిద్ధపడుతున్నారట
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…