టాలీవుడ్లో శ్రీ విష్ణు స్టార్ హీరో ఏమీ కాదు. అతను చేసేవన్నీ పరిమిత బడ్జెట్లో తెరకెక్కే చిన్న సినిమాలే. అతను ఒక సినిమా అనుభవం ఉన్న రామ్ అబ్బరాజు అనే దర్శకుడితో చేసిన చిత్రం సామజవరగమన. రిలీజ్ దగ్గర పడే వరకు ఈ చిత్రానికి పెద్దగా బజ్ లేదు. కానీ విడుదలకు రెండు మూడు రోజుల ముందే వేసిన ప్రిమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి బజ్‌తో రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు అద్భుతాలు చేస్తోంది.
తొలి రోజు ఈ చిత్రానికి ఓ మోస్తరు ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజు కలెక్షన్లు బాగా పుంజుకున్నాయి. శనివారం తొలి రెండు రోజులకు మించి వసూళ్లు వచ్చాయి. డే-1 30-40 శాతం ఉన్న ఆక్యుపెన్సీలు కాస్తా ఆదివారానికి హౌస్ ఫుల్స్‌గా మారడం విశేషం. సైలెంటుగా ఈ చిత్రం సెన్సేషనే క్రియేట్ చేస్తోంది బాక్సాఫీస్ దగ్గర.
ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్యాక్డ్ హౌస్‌లతో నడుస్తోంది సామజవరగమన. ఈవెనింగ్, నైట్ షోలు అయితే చాలా చోట్ల ఫుల్స్ పడిపోయాయి. పెద్ద పెద్ద సింగిల్ స్క్రీన్లలో కూడా మంచి ఆక్యుపెన్సీలు కనిపిస్తుండటం విశేషం. బుక్ మై షోలో మల్టీప్లెక్సుల్లో చాలా షోలు సోల్డ్ ఔట్ అయినట్లు చూపిస్తుండటం విశేషం.
ఒక చిన్న సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ అరుదైన విషయం. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడం.. ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఎంటర్టైన్మెంట్ ఉండటం పెద్ద ప్లస్ అయింది. దీనికి తోడు ముందు వారాల్లో వచ్చిన సినిమాలేవీ నిలబడలేదు. ఈ వారం పోటీగా వచ్చిన సినిమాలు నెగెటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ప్రేక్షకులంతా ఈ సినిమా వైపే మళ్లుతున్నారు. శ్రీ విష్ణుకు ఇప్పటిదాకా బ్రోచేవారెవరురా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా ఉంది. సామజవరగమన దాన్ని అలవోకగా దాటి కెరీర్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవబోతోంది.
This post was last modified on July 3, 2023 7:48 am
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలంలో కొన్ని రోజుల కిందట వెలుగు చూసిన డెడ్ బాడీ డోర్ డెలివరీ…
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…