శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన బయోపిక్ ‘గుంజన్ సక్సేనా’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఒక ధీరోదాత్త మహిళ కథను హృద్యంగా చెప్పారంటూ భారతదేశంలోని క్రిటిక్స్లో అత్యధికులు ఈ చిత్రానికి మంచి మార్కులు వేసారు. అయితే ఈ చిత్రానికి ‘నెపోటిజమ్’ సెగ తగిలింది.
ఈ చిత్రానికి నిర్మాత కరణ్ జోహార్ కావడంతో అతడిపై వున్న ద్వేషం ఈ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్నారు. హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కావడంతో నెపోటిజమ్ వారియర్స్ మరింతగా ఈ చిత్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. సినిమాలోని మంచి, చెడు చూడకుండా జాన్వీ ముఖంలో ఎక్స్ప్రెషన్లు పలకలేదని, కేవలం బంధుప్రీతితో ఇలాంటి టాలెంట్ లేని వారిని బాలీవుడ్ ఎంకరేజ్ చేస్తోందని సగటు ఆడియన్స్తో పాటు సుషాంత్ సింగ్ ఫాన్స్ ఈ చిత్రాన్ని ఎటాక్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని మాత్రమే కాదు ఆలియా నటించిన సడక్ 2 ట్రెయిలర్ రిలీజ్ అయితే ఇంతవరకు ఇండియాలో ఏ వీడియోకీ రానన్ని డిస్‍లైక్స్ దానికి వచ్చాయి. సుషాంత్ సింగ్ మరణం గురించి జనం మరచిపోయే వరకు బాలీవుడ్‍లో కొందరికి ఈ బాధ తప్పేలా లేదు పాపం.
This post was last modified on August 14, 2020 7:35 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…